Bigg Boss Agnipariksha 2: ఎంతో అట్టహాసంగా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ ఎట్టకేలకు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. సామాన్యులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కలగన్న వేలాది మంది సామాన్యులకు తమ టాలెంట్ ని ఈ వేదిక పై చూపించుకునే అవకాశం వచ్చింది. అయితే వేలాది మంది కాస్త గతం వారం గాయత్రీ ఎలిమినేషన్ తో ఇప్పుడు 14 మందికి చేరింది. ఇప్పుడు 14 సంఖ్య కాస్త 13 కి చేరింది. ఈ షో నుండి మరో పాపులర్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఆమె మరెవరో కాదు , భాగీ. రేపు జరిగే ఎపిసోడ్ లో ఆమెకు ఎల్లో కార్డు వస్తుంది. వీకెండ్ ఎలిమినేషన్ ప్రక్రియ లో మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఈమె పెర్ఫార్మన్స్ కాస్త తక్కువ ఉండడం తో జడ్జీలు ఏకాభిప్రాయం తో ఎలిమినేట్ చేశారట.
పైగా ఆమె చెయ్యి కూడా దెబ్బ తినడం తో టాస్కులు ఆడలేకపోతుంది. ఈ సమయం లో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ టాస్కులు ఆడే ఛాన్స్ లేదని , అందుకు ఆమె చెయ్యి సహకరించదని డాక్టర్లు చెప్పడం తో , ఆమెని ఈ షో నుండి తప్పిస్తున్నట్టు చెప్పారట జడ్జీలు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాలనే కల కోసం భాగీ తన జుట్టుని బేబీ కట్ చేయించుకుంది. సాధారణంగా మహిళలు ఎవ్వరూ కూడా తమ అందమైన జుట్టుని కత్తిరించుకోవడానికి ఇష్టం చూపించరు. అలాంటిది భాగీ క్షణం కూడా ఆలోచన చేయకుండా బిగ్ బాస్ కోసం జుట్టు కత్తిరించుకుంది. కానీ దురదృష్టం కొద్దీ ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ , జోకులు వేస్తూ ఉండే భాగీ, ఎలిమినేషన్ రోజున బోరుమని ఏడ్చిందట. ఆమె తోటి కంటెస్టెంట్స్ కూడా భాగీ బాధని చూసి ఎమోషనల్ అయ్యారట.
ఇకపోతే నేటి ఎపిసోడ్ లో భారీ పబ్లిక్ ఓటింగ్ ని పొందుతున్న అమన్ కి కూడా జడ్జీలు ఎల్లో కార్డు ఇస్తారట. అంటే ఆయన కూడా ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఈ వీకెండ్ లో జరిగే టాస్కుల్లో పొరపాటున ఓడిపోతే అమన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది కాబట్టి , అమన్ సేఫ్ అవ్వడమే కాకుండా , ఫినాలే లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చాడట. ప్రస్తుతానికి అయితే ఓటింగ్ లో రోహిత్ మొదటి స్థానం లో కొనసాగుతుండగా, అమన్ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బిగ్ బాస్ house లోకి అడుగుపెట్టబోతున్నారో చూడాలి.