Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: కమెడియన్ కృష్ణ భగవాన్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్..చివరికి ఏమైందంటే!

Pawan Kalyan: కమెడియన్ కృష్ణ భగవాన్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్..చివరికి ఏమైందంటే!

Pawan Kalyan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా కృష్ణ భగవాన్ పేరు ఉంటుంది. ఈయన వేసిన పంచులు, చేసే కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఒకానొక దశలో ఏడాదికి 30 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణ భగవాన్ లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజ కమెడియన్ లో ఒక […]

Pawan Kalyan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా కృష్ణ భగవాన్ పేరు ఉంటుంది. ఈయన వేసిన పంచులు, చేసే కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఒకానొక దశలో ఏడాదికి 30 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణ భగవాన్ లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజ కమెడియన్ లో ఒక గొప్ప రచయితా కూడా ఉన్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఈయన అద్భుతమైన కామెడీ ని పండించడమే కాదు, అద్భుతమైన కథలు రాయగలడు, దర్శకత్వం కూడా చేయగలడు. అలా ఆయన భవిష్యత్తులో ఎప్పుడైనా దర్శకత్వం చేసే అవకాశాలు వస్తాయేమో అని బోలెడన్ని కథలు కూడా రాసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కృష్ణ భగవాన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారు చాలా క్యాజువల్ మనిషి. తాను ఒక పెద్ద సూపర్ స్టార్ అనే గర్వం ఆయనలో ఇసుమంత కూడా ఉండదు. చాలా సింపుల్ గా మాట్లాడుతాడు. నేను గతం లో ఆయన్ని కలిసి ఒక కథ వినిపించాను. అంత పెద్ద సూపర్ స్టార్, ఒక కమెడియన్ దర్శకత్వం లో నటించడానికి ఓకే కూడా చెప్పాడు. కాకపోతే ఆయన కథ విన్నాక , కొన్ని సినిమాలు నాకు సూచించాడు. వాటిని చూసి దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయమని చెప్పాడు. నేను రాసిన కథలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆయన ఎనర్జీ ని మ్యాచ్ చేసే కథ ఇది కాదేమో అని స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ అప్పటికీ నాతో చేయడానికి సిద్దమే అని, కానీ ఆయన ఇమేజ్ కి తగ్గ కథ కాదు అనే ఫీలింగ్ నాలో ఉండడం వల్ల ముందుకు వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చాడు కృష్ణ భగవాన్. ఇకపోతే ఈమధ్య కాలంలో కామెడీ ని బేస్ చేసుకొని తీసే సినిమాలు తక్కువ అవ్వడంతో , కృష్ణ భగవాన్ కి కూడా సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. గతం లో ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి జడ్జి గా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు ఆయన ఆ షో చేయడం లేదు. దీంతో కృష్ణ భగవాన్ ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper