Homeక్రీడలుLionel Messi : మెస్సి రిటైర్మెంట్ వెనక.. గుండె పగిలే బాధ..

Lionel Messi : మెస్సి రిటైర్మెంట్ వెనక.. గుండె పగిలే బాధ..

Lionel Messi : అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి తన కెరియర్ కు వీడ్కోలు పలికాడు . అర్జెంటీనా జాతీయ జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు అతడు ప్రకటించాడు. దీంతో యావత్ ఫుట్బాల్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ కు గురైంది. మెస్సి తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇటీవల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా ఓటమి తర్వాత మెస్సీ ఈ […]

Lionel Messi : అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి తన కెరియర్ కు వీడ్కోలు పలికాడు . అర్జెంటీనా జాతీయ జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు అతడు ప్రకటించాడు. దీంతో యావత్ ఫుట్బాల్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ కు గురైంది. మెస్సి తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టాడు.

ఇటీవల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా ఓటమి తర్వాత మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ ఓడిపోయిన రెండు రోజుల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టు అతడు ప్రకటించాడు. అర్జెంటినా జట్టు తరపున 207 మ్యాచులలో అతడు 125 గోల్స్ సాధించాడు. 2022 లో తన జట్టుకు ఫిఫా ప్రపంచ కప్ అందించాడు. 2021.. 2024 సంవత్సరాల కాలంలో అర్జెంటీనా జట్టుకు రెండు కోపా అమెరికా టైటిల్స్ అందించాడు. ఇటీవల జరిగిన ఫుట్బాల్ ప్రపంచ కప్ లో అర్జెంటీనా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.

రిటైర్మెంట్ వెనక

మెస్సి రిటైర్మెంట్ వెనక గుండె పగిలే బాధ ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా జట్టు స్పెయిన్ చేతిలో ఓడిపోయింది. వాస్తవానికి ప్రపంచ కప్ గెలిచి తన రిటైర్మెంట్ ప్రకటించాలని మెస్సి అనుకున్నాడు. కానీ అతడు ఒకటి అనుకుంటే.. దైవం మరొకటి తలచింది. అప్పటినుంచి అతడు తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించడానికి మెస్సి రెండు కీలక కారణాలను ప్రకటించాడు. యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని మెస్సి భావిస్తున్నాడు. దీనికి తోడు ఇటీవల అతడి తండ్రి చనిపోయాడు.. మెస్సికి ప్రస్తుతం 39 సంవత్సరాలు వయసు ఉంది. అర్జెంటీనా జట్టు కోసం అతడు చేయాల్సింది మొత్తం చేశాడు. కొన్ని సందర్భాలలో గాయాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ దేశం కోసం ఆడాడు.. తనకు 39 సంవత్సరాల వయసు రావడంతో కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని మెస్సి భావిస్తున్నాడు. అది ఇప్పుడు అనువైన సమయం అని అతడు అనుకున్నాడు. నిర్ణయాన్ని బయటపెట్టాడు.

మెస్సీ తండ్రి జార్జ్ మెస్సి ఈ ఏడాది ఆగస్టులో చనిపోయారు. వాస్తవానికి తన రిటైర్మెంట్ లేఖను జూలై 21న అతడు రాశాడు. ప్రపంచ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిపోయిన తర్వాత రెండు రోజులకు అతడు ఈ లెటర్ రాశాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత.. రిటైర్మెంట్ ప్రకటించడానికి తనకంటూ ఒక బలమైన నమ్మకం కలిగిందని అతడు వెల్లడించాడు. ఇక మెస్సి తన క్లబ్ ఫుట్బాల్ కెరియర్ ను ఇంటర్ మియామీ జట్టు తరఫున కొనసాగిస్తున్నాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper