Today 24 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు మహాశివుడి ఆశీస్సులు ఉండడంతో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు మహాశివుడు ఆశీస్సులు ఉండనున్నాయి. దీంతో అనుకున్న పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉండే అవకాశం ఉంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వస్తాయి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. పొత్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. కష్ట కాలంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంతో పని చేస్తారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా కంప్లీట్ చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే సంయమనం పాటించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మహాశివుడి ఆశీస్సులతో గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. అధికారుల ఆశీస్సులు ఉండడంతో ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో ఆర్థిక లాభాలు ఉంటాయి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలను చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి బయటపడతారు. వృత్తిపరమైన ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమిస్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గుతాయి. డబ్బు మిగులుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అనుకోకుండా కత్తుల పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగతంగా ఆదాయాన్ని పొందుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు గతంలో కంటే ఇప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం అధికంగా ఉండడంతో వృత్తిపరంగా రాణిస్తారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. స్నేహితుల సహకారంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. వ్యాపారులకు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ప్రశంసలు అందుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవడంతో వీరితో అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సపోర్టు ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు.