Cockroach Protest: అన్యాయం జరిగితే.. అక్రమాలు చోటు చేసుకుంటే.. అర్హులకు న్యాయం జరగకపోతే కచ్చితంగా మేము వస్తాము. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. అందరికీ అండగా ఉంటాము.. ఇది కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే చెప్పిన మాట.
ఈ మాటల మీద ఆయన నిలబడుతున్నారా.. ఈ మాటలను ఆయన నిజం చేసి చూపిస్తున్నారా.. అందరికీ అండగా నిలబడుతున్నారా.. ఈ ప్రశ్నలకు కాదు అనే సమాధానమే వస్తోంది. ఇటీవల నీట్ ఆందోళనల నేపథ్యంలో అభిజిత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. అనేకమంది విద్యార్థులను ఒకే తాటి మీదికి తీసుకొచ్చి నిరసన చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ ఉద్యమం చేసే విషయంలో అభిజిత్ వ్యవహార శైలి అనేక రకాల అనుమానాలకు కారణమవుతోంది.
కేవలం నీట్ మాత్రమే కాకుండా మనదేశంలో అనేక రాష్ట్రాలలో పోటీ పరీక్షల సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. జార్ఖండ్.. పంజాబ్.. రాజస్థాన్ రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకయ్యాయి. దీనిపై ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఓ యువ నాయకుడు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. కనీసం కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు. జార్ఖండ్ విషయంలో ఏదో కంటితుడుపు ప్రకటన మాత్రమే చేశారు. కానీ ఇంతవరకు క్షేత్రస్థాయిలో పోరాటం చేసిన దాఖలాలు లేవు. నీట్ ఆందోళనల విషయంలో మాత్రం అభిజిత్ అందర్నీ పోగు చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ ముందుగా చెప్పినట్టు అన్ని విషయాలలో ముందు వరుసలో ఉండి పోరాడాలి. ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాకుండా కేవలం కేంద్రం మీద మాత్రమే పోరాటం చేయడం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడం విశేషం. అందువల్లే వీరు చేస్తున్న ఉద్యమాన్ని సెలెక్టివ్ ప్రాపగాండా అని.. సెలెక్టివ్ కాక్రోచ్లు అని జాతీయ వాదులు విమర్శిస్తున్నారు. అనుకూలమైన వ్యక్తులు లేదా మిత్ర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చోటు చేసుకున్న అక్రమాలను వదిలేసి.. కేవలం మిగిలిన చోట్ల మాత్రమే పోరాటం చేయడం కాక్రోచ్ జనతా పార్టీ అసలు రంగును బయటపెడుతోంది. ఇలాంటి సెలెక్టివ్ కాక్రోచ్ లు దీర్ఘకాలం మనదేశంలో మన్న లేవని.. అది సాధ్యం కూడా కాదని జాతీయవాదులు అంటున్నారు. ఇటువంటి ఉద్యమాలు మఘ కార్తెలో పుట్టి పుబ కార్తెలో ముగిసిపోతాయని వారు చెబుతున్నారు.