Homeజాతీయ వార్తలుPunjab: సమర శంఖం సరే.. పదివేల మంది పోలీసులు సరిపోతారా..

Punjab: సమర శంఖం సరే.. పదివేల మంది పోలీసులు సరిపోతారా..

Punjab: అది ఈనాటి సమస్య కాదు. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఏటికేడు తన రూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. యువశక్తి నిర్వీర్యం అవుతోంది. అలవాటు పడినవారు తమ శక్తిని యుక్తిని దానికోసమే ఖర్చు పెడుతున్నారు. ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఆ మత్తులో చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని తీసుకొని.. మత్తులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయింది. అటువంటి వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. […]

Punjab: అది ఈనాటి సమస్య కాదు. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఏటికేడు తన రూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. యువశక్తి నిర్వీర్యం అవుతోంది. అలవాటు పడినవారు తమ శక్తిని యుక్తిని దానికోసమే ఖర్చు పెడుతున్నారు. ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఆ మత్తులో చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని తీసుకొని.. మత్తులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయింది. అటువంటి వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారికి మత్తు పదార్థాలు విక్రయించే వారి పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించబోతోంది. ఏకంగా 10,000 మంది పోలీసులను రిక్రూట్ చేసుకోబోతోంది.

మనదేశంలో పాకిస్తాన్ దేశానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. పంజాబ్ ప్రాంతంలో మత్తు పదార్థాలు విపరీతంగా లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు జిల్లాల్లో మత్తు పదార్థాల తయారీ.. మత్తు పదార్థాల తయారీకి అవసరమయ్యే పంటల సాగు జరుగుతూ ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈసారి అక్కడి భగవంతు సింగ్ మాన్ ప్రభుత్వం మత్తు మీద కఠిన వైఖరి అవలంబించబోతోంది. వాస్తవానికి భగవంతు ప్రభుత్వం మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. మత్తు పదార్థాలు.. వాటిని విక్రయించే ముఠాలకు ప్రభుత్వం సహకారం అందించిందని అభియోగాలు ఉన్నాయి. వాస్తవానికి పంజాబ్ రాష్ట్రంలో మత్తు పదార్థాలను తొక్కి పెట్టడానికి.. ఆ రాష్ట్రాన్ని స్వచ్ఛంగా మార్చడానికి 10,000 మంది కాదు. అంతకుమించిన పోలీసులు అవసరం. ప్రస్తుత ప్రభుత్వం మొదటినుంచి ఇదే ధోరణి ప్రదర్శిస్తే పంబాజ్ లో మత్తు పదార్థాల రవాణా, వినియోగం దాదాపుగా తగ్గేవి.

పంజాబ్లో మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు చివరికి పోలీస్ స్టేషన్ మీద కూడా దాడులకు వెనుకంజ వేయరు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తులను గతంలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు.. పోలీస్ స్టేషన్ల మీద మత్తు పదార్థాలకు బానిసలు అయిన వ్యక్తులు దాడులు చేశారు. కొన్ని సందర్భాలలో పోలీసులను హతమార్చారు కూడా. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటం.. పైగా మత్తు పదార్థాల వినియోగం పంజాబ్ రాష్ట్రంలో విపరీతంగా ఉండటంతో ప్రభుత్వం ఆలస్యంగానైనా నిద్రలేచింది. వాస్తవానికి ఉడ్తా పంజాబ్ లాంటి సినిమా ద్వారా పంజాబ్లో పరిస్థితిని వివరించారంటే అక్కడ ఏ స్థాయిలో మత్తు పదార్థాల వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చు. మత్తు పదార్థాల రవాణా.. తయారీ.. సరఫరా వంటి నెట్వర్క్ మొత్తాన్ని ఎదుర్కోవాలంటే పోలీసు సంఖ్యను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అక్రమ మార్గాలు.. మత్తు పదార్థాల సరఫరా.. వంటి వాటి మీద నిరంతరం నిఘా పెట్టే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే 10,000 మంది పోలీసులు ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి సరిపోతారా.. అంతకుమించిన విభాగాలు అవసరమవుతాయా.. అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ గనుక పంజాబ్ రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యవస్థను ప్రభుత్వం అడుగుదాక తొక్కి వేస్తే.. కచ్చితంగా పంజాబ్ రాష్ట్రంలో అది నవ శకం లాగా మిగిలిపోతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper