Homeక్రీడలుMessi: మెస్సి వీడ్కోలుకు ముందు.. అర్జెంటీనా ఫుట్ బాల్ లో పెను దుమారం..

Messi: మెస్సి వీడ్కోలుకు ముందు.. అర్జెంటీనా ఫుట్ బాల్ లో పెను దుమారం..

Messi: అర్జెంటినా ఫుట్ బాల్ లో ప్రస్తుతం ఒక వివాదం తీవ్రమైన కలకలం రేపుతోంది.. దేశ ఫుట్బాల్ వ్యవస్థలో చోటు చేసుకున్న ఒక కుంభకోణం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. “ఏం జరిగిందో చూస్తే శిక్షలు మాత్రమే కాదు.. బాధ్యులు కూడా రాజీనామా చేయాలి” అనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారం అర్జెంటినా ఫుట్ బాల్ అభిమానులు తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా లెజెండరీ ఆటగాడు Lionel Messi తన అంతర్జాతీయ కెరియర్లో వీడ్కోలు […]

Messi: అర్జెంటినా ఫుట్ బాల్ లో ప్రస్తుతం ఒక వివాదం తీవ్రమైన కలకలం రేపుతోంది.. దేశ ఫుట్బాల్ వ్యవస్థలో చోటు చేసుకున్న ఒక కుంభకోణం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. “ఏం జరిగిందో చూస్తే శిక్షలు మాత్రమే కాదు.. బాధ్యులు కూడా రాజీనామా చేయాలి” అనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.

ఈ వ్యవహారం అర్జెంటినా ఫుట్ బాల్ అభిమానులు తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా లెజెండరీ ఆటగాడు Lionel Messi తన అంతర్జాతీయ కెరియర్లో వీడ్కోలు దశకు చేరుకుంటున్న సమయంలో ఈ వివాదం తెరపైకి రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అసలు ఏమిటి ఈ వివాదం

అర్జెంటీనా ఫుట్ బాల్ వ్యవస్థలో ఆర్థిక వ్యవహారాలు.. పరిపాలన.. నిర్ణయాల వంటి వాటి మీద ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. జరిగిన పరిణామాల మీద పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో తప్పులు గనుక రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి అభిమానులు కోరుతున్నారు అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు.. అధికారికంగా నిర్ధారించిన అంశాలను వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. విచారణ పూర్తయ్య సమయం వరకు ఎవరి పాత్ర పై తుది నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.

ఎందుకు ఈ చర్చ

అర్జెంటీనా జట్టుకు మాత్రమే మెస్సి ఆటగాడు కాదు. ప్రపంచ కప్ మినహా అనేక విజయాలలో అతడు కీలకపాత్ర పోషించాడు. అతడు కెరియర్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో అర్జెంటీనా దేశ ఫుట్ బాల్ వ్యవస్థలో ఇటువంటి వివాదం రావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుత పరిణామాలు కూడా అభిమానులలో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

మెస్సి తరం అర్జెంటీనా ఫుట్ బాల్ కు స్వర్ణ యుగాన్ని అందించింది.. ఫుట్ బాల్ వెలుపల పరిపాలన పారదర్శకత ఆర్థిక జవాబుదారితనం కూడా అంతే ముఖ్యమైన చర్చ ఇప్పుడు మొదలైంది.. ఇక ఈ వివాదంలో అసలు నిజాలు బయటపడాలంటే అధికారిక విచారణ అత్యంత కీలకం. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడం.. వ్యవస్థలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం అవసరం. మరోవైపు నిర్ధారణ కానీ ఆరోపణల ఆధారంగా వ్యక్తులపై తుది తీర్పు ఇవ్వడం కూడా సరికాదు.. మెస్సి వీడ్కోలు దశలో అర్జెంటీనా ఫుట్ బాల్ కు ఇది మైదానంలో కంటే మైదానం మెరుపుల ఎదురైన పెద్ద పరీక్ష లాగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper