spot_img
Homeఅత్యంత ప్రజాదరణవైరల్ వీడియో: కోహ్లీ విజిల్స్.. ఊగిపోయిన ఫ్యాన్స్.. దద్దరిల్లిన స్టేడియం

వైరల్ వీడియో: కోహ్లీ విజిల్స్.. ఊగిపోయిన ఫ్యాన్స్.. దద్దరిల్లిన స్టేడియం

సాధారణంగా క్రికెటర్ల ఆటను చూసి ఫ్యాన్స్ ఈలలు వేస్తారు. గోల చేస్తారు.. చప్పట్లతో కేరింతలు కొడుతారు. కానీ కరోనా లాక్ డౌన్ పుణ్యమానికి ఆటలకు చెక్ పడింది. ఏడాదిగా క్రీడలు లేవు. ఇటీవల క్రికెట్ ప్రారంభమైన ఫ్యాన్స్ ను అనుమతించలేదు.

Also Read: అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గెలుపును ఇక ఆపలేరు

ఇంగ్లండ్ పర్యటనతోనే దేశంలో క్రీడలు మొదలయ్యాయి. క్రికెట్ తోనే ఆరంభమయ్యాయి. అయితే తొలి టెస్టులో ప్రేక్షకులను కరోనా భయానికి అనుమతించలేదు. కానీ రెండో టెస్టుకు అనుమతించారు.

దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉండడం.. అభిమానుల సందడి లేకుండా క్రికెట్ ఆడిన టీమిండియా క్రికెటర్లకు స్వదేశంలో రెండో టెస్టులో ఫ్యాన్స్ రావడంతో ఆ సంతోషం వెల్లివిరిసింది. ఫ్యాన్స్ అరుపులు, కేకలకు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు.

చెన్నై చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్ గోలను రెట్టింపు చేస్తూ స్వయంగా ఈలలు వేస్తూ టిమిండియాకు మద్దతు పలుకాలని కోహ్లీ అభిమానుల వైపు చూస్తూ కోరాడు.  ఫ్యాన్స్ ను అలా హోరెత్తించాలని సైగలు చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. బీసీసీఐ స్వయంగా షేర్ చేసి చాలా రోజుల తర్వాత ఇలా అభిమానులతో కలిసి కోహ్లీ సేదతీరాడంటూ ట్వీట్ చేసింది.

Also Read: చెన్నై టెస్ట్ రసవత్తరం: ఇంగ్లండ్ 134 ఆలౌట్.. భారత్ 195 లీడ్

కోహ్లీ ఈలలు వేసి సైగలతో అభిమానులను కోరగానే వారంతా గట్టిగా అరుస్తూ టీమిండియాకు మద్దతుగా హోరెత్తించారు. కోహ్లీ ఈల వేయగానే చెపాక్ స్టేడియం మార్మోగిపోయింది. చప్పట్లు,కేరింతలతో సందడి పీక్ స్టేజ్ కి చేరింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
Oktelugu Epaper