Homeఎంటర్టైన్మెంట్Sukumar Daughter: డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డు.. తండ్రి నే మించిపోయిందిగా..

Sukumar Daughter: డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డు.. తండ్రి నే మించిపోయిందిగా..

Sukumar Daughter: పాన్ ఇండియా లెవెల్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో సుకుమార్ పేరు కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘పుష్ప’ సిరీస్ తో ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆయన లాంటి క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ ని నేను ఇప్పటి వరకు చూడలేదు , క్రియేటివ్ ఫీల్డ్ లో నేను భయపడేది ఒక్క సుకుమార్ కి మాత్రమే అని రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా అనేక సందర్భాల్లో […]

Sukumar Daughter: పాన్ ఇండియా లెవెల్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో సుకుమార్ పేరు కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘పుష్ప’ సిరీస్ తో ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆయన లాంటి క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ ని నేను ఇప్పటి వరకు చూడలేదు , క్రియేటివ్ ఫీల్డ్ లో నేను భయపడేది ఒక్క సుకుమార్ కి మాత్రమే అని రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా అనేక సందర్భాల్లో తెలిపాడు. అలాంటి డైరెక్టర్ కి ఇప్పటి వరకు కేవలం నేషనల్ అవార్డు మాత్రమే వచ్చింది. అది కూడా నిన్న గాక మొన్ననే. కానీ ఆయన కూతురు కి ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. ఇంత చిన్న వయస్సులోనే తండ్రిని మించిపోవడమంటే సాధారణమైన విషయం కాదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే సుకుమార్ కూతురు సుకృతి వేణి ఇటీవలే సౌత్ కొరియా లో జరిగిన ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో సింగర్ గా వ్యవహరించి , అంతర్జాతీయంగా మ్యూజిక్ లవర్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె అమెరికా లోని బోస్టన్ నగరం లో జగద్విఖ్యాత ‘బర్క్ లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ లో ప్రదర్శన ఇచ్చినందుకు గానూ , ఆమె ప్రతిభని గుర్తిస్తూ ‘ఎన్సెంబల్ ఎక్సలెన్స్ అవార్డు’ ని అందించారు. అంతే కాకుండా ఆ అంతర్జాతీయ స్కూల్ లో ఉచితంగా చదువుకునేందుకు వీలుగా స్కాలర్ షిప్ ని కూడా సొంతం చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలో దాదాపుగా 272 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. వారిలో కేవలం 14 మంది మాత్రమే స్కాలర్ షిప్ కి ఎంపిక అయ్యారు , వారిలో సుకృతి కూడా ఉండడం గమనార్హం. ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, సింగర్స్ క్యాటగిరీలో పూర్తి స్థాయి స్కాలర్ షిప్ ని సొంతం చేసుకున్న ఏకైక విద్యార్థి కూడా సుకృతి నే.

చిన్న వయస్సులో లోనే ఈ చిన్నారి సాధిస్తున్న ఈ విజయాలను చూసి , సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా పక్కనా పెడితే సుకృతి వెండితెర అరంగేట్రం కూడా చేసింది. ఆమె మొదటి చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ఇందులో చైల్డ్ ఆర్టిస్టు గా నటించిన ఈమెకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు , అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ ఆమె నేషనల్ అవార్డు ని కూడా అందుకుంది. సుకుమార్ కి కూడా ఇలాంటి ఘనత దక్కలేదు. చిన్న వయస్సులోనే ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్న ఈ చిన్నారి, పెద్దయ్యాక ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper