marriage expectations : కన్యాశుల్కం.. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది. ఇకపై ఇదే కల్చర్ మొదలవుతుంది. ఎందుకంటే అబ్బాయిలకు తగ్గట్టుగా అమ్మాయిలు లేరు. ఒకవేళ అమ్మాయిలు ఉన్నప్పటికీ.. అంత ఈజీగా పెళ్లికి ఇష్టాన్ని చూపించడం లేదు.
ఈ కులం.. ఆ కులం అనలేదు.. అన్ని కులాలలో అమ్మాయిల కొరత విపరీతంగా ఉంది. కొందరైతే అబ్బాయిలు కట్నాలను పట్టించుకోవడం లేదు. చదువులను పట్టించుకోవడం లేదు.. అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. పెళ్లి జరిగితే చాలు అని భావిస్తున్నారు. ఒంటికొమ్ము జీవితం కాకుండా.. జంటగా బతికితే చాలు అని అనుకుంటున్నారు.
అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం.. ఉన్న అమ్మాయిలకు అంచనాలు పెరిగిపోవడంతో చాలామంది అబ్బాయిలకు వివాహాలు జరగడం లేదు. దీంతో ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు వంద మెట్లు దిగివస్తున్నారు. చివరికి అమ్మాయిలకు కట్నాలు కూడా ఇవ్వడానికి వెనుకంజు వేయడం లేదు. కులాలను పట్టించుకోవడం లేదు. చివరికి మతాలను కూడా పట్టించుకోవడం లేదు. పెళ్లి జరిగితే చాలు అని అబ్బాయిలు అనుకుంటున్నారు.
అబ్బాయిలు దిగివస్తున్న నేపథ్యంలో అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. వివాహాల విషయంలో అమ్మాయిల పేరెంట్స్ అంచనాలపై ఒక మహిళ వీడియో చేసింది. అది కాస్త సంచలనంగా మారింది. అబ్బాయికి ఇండియాలో 40 లక్షలు.. విదేశాల్లో అయితే కోటి జీతం గా రావాలట. పైగా 10 కోట్ల వరకు ఆస్తులు ఉండాలట. అత్తమామల ఇబ్బందులు ఉండకూడదు అట. తోటి కోడళ్ళు.. ఆడపడుచులు లేకుంటే ఇంకా బెటర్ అన్నట్టుగా వారి ఆలోచనలు ఉన్నాయని ఆ మహిళ ఆ వీడియోలో చెబుతోంది. అబ్బాయి ఉద్యోగంతో పాటు.. వారి తల్లిదండ్రులు కూడా మంచి స్థాయిలో ఉండాలని.. కుటుంబానికి బలమైన నేపథ్యం ఉండాలని కోరుకుంటున్నారని ఆ మహిళ ఆ వీడియోలో చెప్పింది. ఆ మహిళ చెప్పిన మాటలను చూస్తే ఈ జన్మలో ఏ అబ్బాయికి కూడా పెళ్లి కాదు. ఎందుకంటే ఇన్ని రకాల అనుకూలతలు ఉండడం అంత ఈజీ కాదు.
ఇప్పటికే దేశంలో చాలామంది యువకులు వివాహాలు జరగక ఒంటరిగా మిగిలిపోతున్నారు. కొందరైతే ఇక ఈ జన్మకి ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కడో ఒకచోట వివాహాలు జరుగుతున్నాయి. మగవాళ్ళు అన్ని విషయాలలో కాంప్రమైజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. కానీ.. మగవాళ్ళు ఈ స్థాయికి దిగివచ్చినప్పటికీ కూడా. అమ్మాయిల తల్లిదండ్రులు ఇలాంటి కోరికలు కోరడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.