Homeజాతీయ వార్తలుMonika Shukla : ఈమె లేడీ సింగం.. నిరసనకారులను ఒంటిచేత్తో ఆపింది.. వైరల్ వీడియో

Monika Shukla : ఈమె లేడీ సింగం.. నిరసనకారులను ఒంటిచేత్తో ఆపింది.. వైరల్ వీడియో

Monika Shukla : ఆమె తెగువ సింహానికి మించిపోయింది. ఆమె బలం పులిని దాటిపోయింది. ఆమె నిలబడిన తీరు చప్పట్లు కొట్టించింది. ఆమె చూపించిన సాహసం సెల్యూట్ చేయించింది. సినిమాల్లో సింగాలను చూసి ఉంటారు. కానీ ఈమె రియల్ లేడీ సింగం. ఆమె పేరు మౌనిక శుక్ల. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అత్యంత కఠినంగా ఉంటారు ఆమె. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిపై మర్యాద […]

Monika Shukla : ఆమె తెగువ సింహానికి మించిపోయింది. ఆమె బలం పులిని దాటిపోయింది. ఆమె నిలబడిన తీరు చప్పట్లు కొట్టించింది. ఆమె చూపించిన సాహసం సెల్యూట్ చేయించింది. సినిమాల్లో సింగాలను చూసి ఉంటారు. కానీ ఈమె రియల్ లేడీ సింగం.

ఆమె పేరు మౌనిక శుక్ల. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అత్యంత కఠినంగా ఉంటారు ఆమె. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిపై మర్యాద చూపిస్తారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తారు. రాజకీయ నాయకుల మీద ఏమాత్రం కనికరం చూపించరు. అన్యాయం జరిగితే వెంటనే రంగంలోకి దిగుతారు. అన్యాయానికి అన్యాయం చేసి.. న్యాయానికి న్యాయం చేస్తారు.

మౌనిక విధి నిర్వహణలో కఠినంగా ఉంటారు. ఇటీవల భోపాల్ నగరంలో రైతులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఏకంగా ప్రత్యేక వాహనాలలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి వారు వెళ్లారు. ఈ సమయంలో మౌనిక విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులు వెళ్తున్న బస్సులను ఆమె అడ్డుకున్నారు. వందలాది మంది రైతులు ముఖ్యమంత్రి కార్యాలయం అని ముట్టడించడానికి వెళ్తుంటే.. మోనిక మాత్రం అడ్డుగా నిలబడ్డారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల ధర్నాకు మద్దతుగా ముంబైలో పోలీసు బస్సును ఒక యువతి వంటి చేత్తో ఆపింది. ఆ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

భోపాల్ నగరంలో కూడా మౌనిక అదేవిధంగా చేసింది. రైతులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించకుండా అడ్డుకుంది. ఎక్కడ కూడా ఆమె తన లాఠీకి పని చెప్పలేదు. దురుసుగా ప్రవర్తించలేదు. అడ్డగోలుగా మాట్లాడలేదు. శాంతియుతంగా వ్యవహరించింది. తన విధి నిర్వహణను అద్భుతంగా పాటించింది. మోనిక చూపించిన తెగవా ఇప్పుడు చప్పట్లు కొట్టేలా చేస్తోంది. యావత్ దేశం మొత్తం ఆమె చూపించిన ధైర్యానికి సెల్యూట్ చేస్తోంది.

నిరసనకారులు భారీగా వచ్చినప్పుడు.. ఆందోళనలు చేస్తున్నప్పుడు మగ పోలీసుల భయపడుతుంటారు. వారిని కట్టడి చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. కానీ మోనికా ఏమాత్రం భయపడలేదు. వెనకడుగు వేయలేదు. ధైర్యంగా నిలబడింది. వందల మందిని ఒక్క అధికారి ఆపింది. ఏ ఒక్క నిరసనకారుడిని ఆమె ఇబ్బంది పెట్టలేదు. అడ్డగోలుగా మాట్లాడలేదు. శాంతియుతంగా వ్యవహరించింది. పోలీసు అధికారి విధుల్లో ఉంటే.. వాటిని సక్రమంగా నిర్వహిస్తే ఎలా ఉంటుందో ఆమె నిరూపించింది. కాగా, మోనిక గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper