Raveena Tandon: కుక్కలు అత్యంత విశ్వాస పాత్రమైన జంతువులు. వాటికి ఆహారం పెట్టి.. ఆవాసం కల్పిస్తే మనిషికి అత్యంత నమ్మకంగా ఉంటాయి. అందువల్లే కుక్కలను మనుషులు అమితంగా ప్రేమిస్తుంటారు. వాటిని ఇంట్లో సభ్యుల మాదిరిగా భావిస్తుంటారు.
ఆధునిక కాలంలో రకరకాల బ్రీడ్ లు అందుబాటులోకి వచ్చాయి. స్తోమత ఆధారంగా కుక్కలను కొనుగోలు చేసి.. వాటిని పెంచుకుంటుంటారు. కొన్ని కుక్కలు నిశ్శబ్దంగా ఉంటాయి. యజమాని ఇంట్లోకి ఎవరైనా వస్తే తాటతీస్తాయి. మరికొన్ని కుక్కలు చాలా వైలెంట్ గా ఉంటాయి. ఇది కరవక పోయినప్పటికీ అరిచి గోల చేస్తుంటాయి. కుక్కలు ఎలా ప్రవర్తించినప్పటికీ తమ మీద ప్రేమ కనబరిచిన యజమాని క్షేమాన్ని మాత్రమే కోరుకుంటాయి.
ఇక వీధి కుక్కలు అవి వైల్డ్ గానే ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా తీస్తుంటాయి. గతంలో అనేక సందర్భాలలో వీధి కుక్కలు కరవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో హైదరాబాదులో వీధి కుక్కల దాడుల వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన తీరు యావత్ దేశాన్ని కలచివేసింది. చివరికి వీధి కుక్కల వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వీధి కుక్కలు.. బ్రీడ్ కుక్కల వల్ల సామాన్యులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ కుక్క వ్యవహరించిన తీరువల్ల అగ్రశ్రేణి కథానాయక చుక్కలు చూసింది. ఒక క్షణం పాటు ఏం జరుగుతుందో అర్థం కాక.. చూసేవాళ్ళ గుండెలు అదిరిపోయాయి. ఆ సమయంలో ఆ హీరోయిన్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడికి వచ్చిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు
బాలీవుడ్ లో వెటరన్ హీరోయిన్ గా రవీనాటాండన్ కొనసాగుతోంది. ఈమె హిందీలో రూపొందిన ఓ మై గాడ్ అనే సినిమా ప్రమోషన్ లో పాల్గొంటుంది.. ఈ సినిమా కుక్క కథ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కు రవీనా హాజరైంది. ఈ సినిమాలో నటించిన కుక్క కూడా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆ కుక్కను రవీన పట్టుకుంది. అయితే ఆ కుక్కకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో ఆమెను కరవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో రవీనా చాకచక్యంగా తప్పించుకుంది. పైగా ఆ కుక్క నోటిలో ఆమె డ్రెస్ త్రెడ్ చిక్కుకుపోయింది. దానిని జాగ్రత్తగా బయటకు తీసి ఆ తర్వాత రవీనా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కుక్క కరవడానికి ప్రయత్నించినప్పుడు హీరోయిన్ వ్యవహరించిన తీరువల్ల తప్పించుకుంది. ఒకవేళ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న దాడి జరిగేది. ఆ తర్వాత రేబిస్ వ్యాక్సిన్లు వేసుకోవాల్సి వచ్చేది. హీరోయిన్ వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎంతటి వారైనా సరే కుక్కలకు దూరంగా ఉండడమే మంచిది అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Omg…. A dog attacked Raveena ji. Hopefully, she is safe pic.twitter.com/e8w7Dz9ftA
— BollyHollywood (@BolllyHolly) August 7, 2026