Viral Video: ఇది నిజమేనా.. లేకుంటే ఎవరైనా సృష్టించిన ఊహాజనితమా.. ఒకవేళ రియాల్టీ అనుకున్నప్పటికీ ఇది ఎలా సాధ్యమవుతుంది.. ఈ కంటెంట్ రాస్తున్నప్పుడు మాకు ఇటువంటి అనుమానాలు చాలా వచ్చాయి. అనేక రకాల మాధ్యమాలను పరిశీలించాం. ఎందుకైనా మంచిదని అనేక రకాలుగా క్రాస్ చెక్ చేసుకున్నాం. కానీ ఇది నిజమేనని తేలింది.
ఆమెకు 81 సంవత్సరాలు. ఉండేది ఫ్రాన్స్ లో. కాటికి కాళ్లు చాపే వయసులో ప్రేమలో పడింది. అలాగని ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా లేదు. చాలామందితో డేటింగ్ చేసింది. కొంతమందితో ప్రేమ వ్యవహారం కూడా నడిపింది. పెళ్లి చేసుకుని పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. పెళ్లిలు జరిగాయి. వాళ్లంతా కూడా పిల్లల్ని కన్నారు. కానీ ఆమెకు ఈ వయసులో ప్రేమ కావాల్సి వచ్చింది. అంతమంది పిల్లలు ఉన్నప్పటికీ.. ఆమెకు ప్రేమ రాహిత్యం ఏర్పడింది. చేసుకున్న భర్త కన్నుమూశాడు. పిల్లలు ఎవరిదారి వారు చూసుకున్నారు. ఆమె ఒంటరిగా ఉండడం వల్ల తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
81 సంవత్సరాల ఆమె.. 24 సంవత్సరాల యువకుడిని ప్రేమించింది. వీరిద్దరి మధ్య ఆన్లైన్లో కొంతకాలంగా చాటింగ్ వ్యవహారం నడుస్తోంది. ప్రతిరోజు ఇద్దరూ వీడియో కాల్ చేసుకుంటున్నారు. మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఒకరి గురించి ఒకరు వాకబు చేసుకుంటున్నారు. అమితమైన ప్రేమను కనబరుస్తున్నారు. దీంతో ఇద్దరు విడివిడిగా ఉండలేని పరిస్థితి వచ్చారు. ఇటీవల ఆ వృద్ధురాలు ఆ యువకుడిని కలవడానికి వచ్చింది. ఆమె రాకను తెలుసుకున్న అతడు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆమె కనిపించగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతుంది. అయితే వీరిద్దరూ సెప్టెంబర్ లో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి మధ్య 51 సంవత్సరాల గ్యాప్ ఉంది.
ఆ యువకుడు చాలా చక్కగా మాట్లాడేవాడు. ఆమె గురించి అనేక రకాలుగా వాకబు చేసేవాడు. ఆరోగ్యం గురించి నిత్యం కనిపెట్టుకొని ఉండేవాడు. ఆమెకు ఏం కావాలో తెలుసుకునేవాడు. అతని తాపత్రయం ఆమెకు నచ్చింది. అందువల్లే అతడికి ప్రపోజ్ చేసింది. చివరికి వాళ్ల కథ ఇక్కడ దాకా వచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్ లో వారిద్దరు ఉండబోతున్నారు. ఆ బామ్మకు ఫ్రాన్స్ లో భారీగా ఆస్తిపాస్తులున్నాయి. ఆ యువకుడి లైఫ్ బాగుండాలంటే తాను అతడిని ఫ్రాన్స్ తీసుకుపోవాలని ఆ బామ్మ చెప్పడం విశేషం.