Homeఅత్యంత ప్రజాదరణమహేష్ మళ్ళీ అదే తప్పు చేశాడా ?

మహేష్ మళ్ళీ అదే తప్పు చేశాడా ?

సినిమా కధల్ని సెలెక్ట్ చేసుకోవడం హీరోలకు కత్తిమీద సాము లాంటిది. ఎందుకంటె కథ raw గా ఉన్నపుడు జడ్జ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ కథ పూర్తి గా రెడీ అయినా గానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న సందేహం ఒక పట్టాన వదలదు. అలా సరైన నిర్ణయం తీసుకోలేక మన స్టార్ హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని వదులు కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇడియట్ , పోకిరి , ఒక్కడు చిత్రాలు మొదట […]


సినిమా కధల్ని సెలెక్ట్ చేసుకోవడం హీరోలకు కత్తిమీద సాము లాంటిది. ఎందుకంటె కథ raw గా ఉన్నపుడు జడ్జ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ కథ పూర్తి గా రెడీ అయినా గానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న సందేహం ఒక పట్టాన వదలదు. అలా సరైన నిర్ణయం తీసుకోలేక మన స్టార్ హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని వదులు కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇడియట్ , పోకిరి , ఒక్కడు చిత్రాలు మొదట పవన్ కళ్యాణ్ దగ్గరికే వెళ్ళాయి. కానీ పవన్ కళ్యాణ్ వాటిని జడ్జ్ చేయలేక పోవడం తో అవి రవితేజ ,మహేష్ బాబు దగ్గరికి వెళ్లాయి. అల్ ఇండియా మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ విషయం లోకూడా అలాంటి సంఘటన జరిగింది. బిగ్ బి ని ఓవర్ నైట్ స్టార్ గా చేసిన జంజీర్ చిత్రం కూడా ముందు దేవానంద్ ఆ తరవాత శత్రుఘ్న సిన్హా దగ్గరికి వెళ్లి చివరికి అమితాబ్ సాబ్ దగ్గరికి వచ్చి ఆయన ఫేట్ మార్చింది .

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందట ప్రిన్స్ మహేష్ బాబు కూడా అదే పొరబాటు చేస్తున్నాడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం మొదట మహేష్ బాబు దగ్గరికే వెళ్ళింది. కానీ ప్రిన్స్ మహేష్ బాబు ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం తో అదికాస్తా రామ్ చరణ్ కి అల్ టైం హిట్ గా మిగిలి పోయింది. సుకుమార్ రంగస్థలం లాంటి భారీ హిట్ అందుకున్నాక మరో సినిమా పట్టాలెక్కించడానికి రెండేళ్లు పట్టింది. ఆయన రంగస్థలం మూవీ తరువాత మహేష్ బాబు తో మూవీ చేయాలని ” పుష్ప” స్టోరీ వినిపించగా మహేష్ బాబు పూర్తి స్క్రిప్ట్ తో సంతృప్తి చెందక ఆ ప్రాజెక్ట్ చేయను అని చెప్పేశాడు ..కాగా ఇపుడు అదే స్క్రిప్ట్ తో బన్నీ, సుకుమార్ మూవీ చేస్తున్నారు. పుష్ప అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper