Rashmika Mandanna Rejected Movies: నేషనల్ క్రష్ గా దూసుకుపోతుంది రష్మిక మందాన. ఈ 26 ఏళ్ల కన్నడ బ్యూటీ చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అమ్మడు సక్సెస్ రేట్ ఆమెను హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా మార్చేసింది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Rashmika Mandanna
తలపతి విజయ్-వంశీ పైడిపల్లి మూవీలో హీరోయిన్ గా చేస్తున్న రష్మిక, పుష్ప 2 లో మరోమారు అల్లు అర్జున్ తో జత కట్టనున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా-రన్బీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటితో పాటు రెండు తెలుగు, మరో రెండు హిందీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
Also Read: Priyanka Chopra: బ్రా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
అయితే రష్మిక మందాన సినిమాల ఎంపిక విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని తెలుస్తోంది. ఆమె కొన్ని స్టార్ హీరోల చిత్రాలు, క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా పలు కారణాలతో రిజెక్ట్ చేశారని సమాచారం . రష్మిక తన కెరీర్ లో వదిలేసిన చిత్రాలు ఏమిటో చూద్దాం…
ఆచార్య మూవీలో పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటించారు. చిరంజీవి-చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్య మూవీలో పూజా పాత్ర కోసం మొదట రష్మిక మందానను అడిగారట. డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని ఆమె సున్నితంగా తిరస్కరించారట. ఇక ఆచార్య ఫలితం మనందరికీ తెలిసిందే. కారణం ఏదైనా ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పి రష్మిక మంచి నిర్ణయం తీసుకుంది.
రష్మిక డెబ్యూ మూవీ కిరాక్ పార్టీ. ఈ కన్నడ చిత్రాన్ని హిందీలో హీరో కార్తీక్ ఆర్యన్ రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ లో నటించిన రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని యూనిట్ భావించగా, ఆమె చేయనని చెప్పారట. దీంతో కృతి సనన్ ని ఎంపిక చేశారు.
Rashmika Mandanna
నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో అదే టైటిల్ తో షాహిద్ కపూర్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ హీరోయిన్ ఆఫర్ మొదట రష్మిక తలుపు తట్టింది. ముద్దు సీన్స్ అధికంగా ఉన్నాయని, రష్మిక ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారట. హిందీ జెర్సీ డిజాస్టర్ గా నిలిచింది.
తలపతి విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో విడుదలైన మాస్టర్ తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మాస్టర్ మూవీ హీరోయిన్ ఛాన్స్ కూడా రష్మిక తిరస్కరించారట. హీరోయిన్ పాత్రకు పెద్దగా నిడివి, ప్రాధాన్యత లేని కారణంగా చేయనని చెప్పారట. దీంతో ఈ ఆఫర్ హీరోయిన్ మాళవిక మోహనన్ కి దక్కింది.
అలాగే విజయ్ లేటెస్ట్ రిలీజ్ బీస్ట్ మూవీలో సైతం రష్మిక నటించాల్సి ఉంది. పూజా హెగ్డే కంటే ముందు బీస్ట్ మూవీ ఆఫర్ రష్మిక వద్దకు వెళ్ళింది. కారణం తెలియదు కానీ, బీస్ట్ ఆఫర్ రష్మిక రిజెక్ట్ చేశారట. బీస్ట్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే.
వీటితో పాటు బంగార్రాజు మూవీలో కృతి శెట్టి చేసిన నాగలక్ష్మి, మహాసముద్రం మూవీలో అదితిరావ్ హైదరి చేసిన మహా పాత్రలను రష్మిక వదులుకున్నారు. అలాగే రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 ఆఫర్ రష్మిక వద్దకు రాగా పలు కారణాలతో రిజెక్ట్ చేశారట.
Also Read: JP Nadda- Janasena: వైసీపీ వద్దు.. బీజేపీదే అధికారం..మరి జనసేన పరిస్థితి ఏంటి?
Recommended Videos