Samantha: సమంత ఎవర్ గ్రీన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. కారణం… వివాహం అయ్యాక కూడా సమంత డిమాండ్ తగ్గలేదు. స్టార్ హీరోల పక్కన కమర్షియల్ రోల్స్ చేస్తుంది. ఆమె కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది రంగస్థలం. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన చిత్రం ఇది. రంగస్థలం ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. చిట్టిబాబు పాత్రలో ఎంతగా రామ్ చరణ్ ఆకట్టుకున్నాడో… అదే స్థాయిలో రామలక్ష్మి పాత్రలో సమంత మెస్మరైజ్ చేసింది. పల్లెటూరి అమ్మాయిగా సమంత నటన చాలా సహజంగా ఉంటుంది.
అయితే రంగస్థలంలో హీరోయిన్ పాత్రకు సమంత వద్దని పలువురు సలహా ఇచ్చారట. దర్శకుడు సుకుమార్ రామలక్ష్మి పాత్రకు సమంతనే అనుకున్నారట. అప్పటికే సమంత హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. పెళ్ళైన సమంతను హీరోయిన్ గా తీసుకోవడం సరికాదు. ఆమె వద్దని పలువురు సలహా ఇచ్చారట. కానీ సుకుమార్ దృష్టిలో ఆ పాత్రకు సమంత బాగా సెట్ అవుతుందనే భావన ఉందట.
ఫైనల్ ఒపీనియన్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవిని సంప్రదించారట. ఆయన సమంతకే ఓటు వేశారట. పెళ్ళైతే ఏమిటీ.. సమంత మంచి నటి. సమంత బాగా చేసిందా లేదా అనేది చూస్తారు కానీ.. ఆడియన్స్ ఆమెకు పెళ్లి అయ్యిందా లేదా అనేది ఆలోచించరు, అని చిరంజీవి అన్నారట. దాంతో సుకుమార్ సమంతను ఫైనల్ చేశారట. సుకుమార్, చిరంజీవి నమ్మకాన్ని నిలబెడుతూ గొప్ప నటనతో సమంత రంగస్థలం విజయంలో తన వంతు పాత్ర పోషించింది.
రంగస్థలం అనేక ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. సుకుమార్ తన గత చిత్రాలకు భిన్నంగా ఓ రివేంజ్ విలేజ్ డ్రామా ఎంచుకోవడం కొసమెరుపు. హాలీవుడ్ తరహా క్లాస్ మూవీస్ కంటే మన నేటివిటీతో కూడిన చిత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయని ఆయనకు రంగస్థలం విజయంతో అర్థం అయ్యింది. రంగస్థలం స్ఫూర్తితో పుష్ప మూవీ తెరకెక్కించి సుకుమార్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు.
Web Title: Sukumar about samantha in rangasthalam movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com