Homeబిజినెస్Simple Wave Electric Scooter : సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇందులో ఫీచర్లు మామూలుగా...

Simple Wave Electric Scooter : సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇందులో ఫీచర్లు మామూలుగా లేవు.. వెంటనే కొనేయండి..

Simple Wave Electric Scooter : పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. భవిష్యత్తు కాలంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్లే అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి వచ్చేసాయి. రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా వచ్చిన ఓ కంపెనీ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ మొత్తాన్ని షేర్ చేస్తోంది. ఈవీ వెహికల్స్ తయారీలో సింపుల్ ఎనర్జీ కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ తన మొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వేవ్ ను మార్కెట్లోకి […]

Simple Wave Electric Scooter : పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. భవిష్యత్తు కాలంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్లే అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి వచ్చేసాయి. రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా వచ్చిన ఓ కంపెనీ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ మొత్తాన్ని షేర్ చేస్తోంది.

ఈవీ వెహికల్స్ తయారీలో సింపుల్ ఎనర్జీ కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ తన మొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వేవ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీన్ని ప్రారంభ ధరను (ఎక్స్ షోరూం) 1.10 లక్షలు గా నిర్ణయించింది. దీనికి మంచి రేంజ్ ఉంది. ఎక్కువ స్టోరేజ్ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా తక్కువ నిర్వహణతో ద్విచక్ర వాహనాలు నడపాలి అనుకునే వారికి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యుత్తమమైన ఎంపిక. విద్యార్థులు.. ఆఫీస్ కి వెళ్లే వారికి ఈ స్కూటర్ అద్భుతంగా ఉంటుంది. దీనికి సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. ఈనెల చివర్లో డెలివరీలో ప్రారంభం కాబోతున్నాయి.

ఇప్పటికే మార్కెట్లో ఆథర్ కోణార్క్.. టీవీఎస్ ఐ క్యూబ్.. బజాజ్ చేతక్ వంటి పాపులర్ ఇవిలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ స్కూటర్లో స్టాండర్డ్.. ప్లస్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా ఆరు కాన్ఫిగరేషన్లలో ఇది అందుబాటులో ఉంది. ఇందులో బ్యాటరీ 2.2 kwh.. 3.7 కె డబ్ల్యూహెచ్.. 5 కే డబ్ల్యూ హెచ్ వంటి ఎంపికలను అందుబాటులో ఉంచారు. ఒకసారి గనక చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. దీని ఐడి సి రేంజ్ 243 కిలోమీటర్ల వరకు ఉంది. ఇక హై ఎండ్ వేరియెంట్లో 6.4 కె డబ్ల్యూ మోటార్ ను ఇందులో అందుబాటులో ఉంచారు. కేవలం 3.3 సెకండ్ల కాలంలోనే ఇది 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రతిరోజు దీనిని వాడడానికి అత్యంత సౌకర్యవంతంగా ఉండడానికి 7 లీడర్ల భారీ స్టోరేజ్ స్పేస్.. అలసందరమైన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

ఈ స్కూటర్ ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ లో 1,09,999 గా నిర్ణయించారు. మిగతా కంపెనీల ఫ్యామిలీ ఈవీలతో దీనిని పోల్చి చూస్తే ధర తక్కువగా ఉంది. టాప్ వేరియంట్ అయినప్పటికీ వేవ్ ప్లస్ లో 5 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాకప్ అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 243 కిలోమీటర్లు.. గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తుంది. 3.7 కే బి హెచ్ బ్యాటరీ ఉన్న మిడ్ వేరియంట్ 170 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 2.7 కే డబ్ల్యూహెచ్.. 2.2 kwh బ్యాటరీలతో వచ్చే వేరియెంట్లు 132 కిలోమీటర్లు..110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఈనెల 25 నుంచి డెలివరీలు మొదలవుతాయని తెలుస్తోంది. ఈనెల చివరి వారం వరకు డెలివరీలు మొత్తం విస్తృతంగా అందించడానికి కంపెనీ ప్లాన్ రూపొందించింది. ఇక ఈ స్కూటర్ పర్ల్ వైట్.. ట్విలైట్ బ్లాక్.. పోలారా బ్లూ.. డాల్ఫిన్ గ్రే.. ఫారెస్ట్ గ్రీన్.. విలేజ్ బ్లాక్ వాటి రంగుల్లో అందుబాటులో ఉంది. టోకెన్ అమౌంట్ 1947 లోనే దీనిని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తి పేమెంట్ చేస్తే కేవలం పది రోజుల్లోనే బైక్ డెలివరీ చేస్తామని ఈ సంస్థ చెబుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper