Homeఉద్యోగాలుBoss Employee Relationship: బాస్, ఉద్యోగి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండాలి?

Boss Employee Relationship: బాస్, ఉద్యోగి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండాలి?

Boss Employee Relationship: బాస్, ఉద్యోగి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండాలి? ఒక ఉద్యోగి తన జీవితంలో ఇంట్లో కంటే కార్యాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతాడు. ఇలాంటి అప్పుడు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలి. చాలామంది ఎంత కష్టపడినా కూడా అక్కడి తోటి ఉద్యోగులు లేదా బాస్ పనితీరు బాగా లేకపోతే నరకంలా కనిపిస్తుంది. అలాగని సీరియస్ నెస్ లేకపోతే చేసే వర్క్ లో గ్రోత్ కనిపించదు. ఇలాంటప్పుడు బాస్, ఉద్యోగి మధ్య ఎలాంటి […]

Boss Employee Relationship: బాస్, ఉద్యోగి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండాలి?

ఒక ఉద్యోగి తన జీవితంలో ఇంట్లో కంటే కార్యాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతాడు. ఇలాంటి అప్పుడు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలి. చాలామంది ఎంత కష్టపడినా కూడా అక్కడి తోటి ఉద్యోగులు లేదా బాస్ పనితీరు బాగా లేకపోతే నరకంలా కనిపిస్తుంది. అలాగని సీరియస్ నెస్ లేకపోతే చేసే వర్క్ లో గ్రోత్ కనిపించదు. ఇలాంటప్పుడు బాస్, ఉద్యోగి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి? ఒకరికొకరు ఎలాంటి సహాయం చేసుకోవాలి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక సంస్థ లేదా కంపెనీకి ఉద్యోగి ఎంత ముఖ్యమో.. మేనేజర్ లేదా లీడర్ కూడా అంతే పని తీరును కనబరుస్తారు. అయితే ఒక ఉద్యోగి సరైన విధంగా పనిచేస్తున్నాడంటే అందుకు కారణం మేనేజర్ వ్యూహమే అని అంటుంటారు. ఒక ఉద్యోగి క్రమశిక్షణ లేకపోతే కూడా ఇతడిని బాధ్యుడిని చేస్తారని. ఒకరు ఆదేశిస్తే మరొకరు సక్రమంగా విధులు నిర్వహించడం.. ఇలా ఇద్దరి మధ్య సరైన వాతావరణం ఉంటేనే ఆ కంపెనీ లేదా సంస్థ అభివృద్ధి చెందుతుంది.

అయితే ఇక్కడ ముందుగా ఉద్యోగి క్రమశిక్షణను అలవర్చుకోవాలి. తనకు అప్పగించిన బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి సమయంలో కొన్ని తప్పులు చేయవచ్చు.. అలాగే ఒక్కోసారి కష్టపడిన తర్వాత కూడా ప్రశంసలు అందకపోవచ్చు.. అంతేకాకుండా ఒక పనిని సరైన సమయంలో పూర్తి చేయడం లేదా నమ్మకంగా ఉండడం వంటివి ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలు.

ఒక ఉద్యోగి పనితీరును గమనిస్తూ.. ఆ పనితీరును మెరుగుపరిచే బాధ్యత బాస్ పై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అప్పుడు బాస్ ఒకవైపు ప్రొఫెషనల్ సంబంధాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే బాస్ చెప్పే విషయాలను ఉద్యోగి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంతేకాకుండా బాస్ ను గౌరవించే విధంగా ప్రవర్తించాలి. ఒక విషయాన్ని వివరించడానికి ఉద్యోగికి అర్థమయ్యే భాషను ఎంచుకోవాలి. ముఖ్యంగా వారితో కో-ఆపరేటివ్ సంబంధాన్ని కలిగి ఉండాలి.

కొన్నిసార్లు ఉద్యోగిపై బాస్ కోపానికి దిగవచ్చు. కానీ ఆ తర్వాత తాను వర్క్ కోసమే కోపానికి దిగవలసి వచ్చిందని వివరించాలి. పర్సనల్ విషయంలో తలదూర్చకుండా.. వ్యక్తిగత దూషణలు చేయకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగి కొన్నాళ్లపాటు భరించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

ఇదే సమయంలో ఉద్యోగులు సైతం బాస్ కు అనుగుణంగా పనిచేయాలి. చాలా సంస్థల్లో తోటి వారి ఎదుగుదలను ఓర్వలేక అనవసరపు ఆరోపణలు, అలజడలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వారిని గమనించి.. తప్పొప్పులను గుర్తించి.. వారికోసం కాకుండా సంస్థ మనుగడ కోసం.. అభివృద్ధి కోసం.. బాస్ చెప్పిన విషయాలను సక్రమంగా పాటిస్తూ ఉండాలి.

ఈ విధంగా ఒకరికొకరు స్వచ్ఛమైన వాతావరణాన్ని కలిగి ఉంటూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలి. బాస్, ఉద్యోగి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణ ఉంటూనే.. విధుల విషయంలో మాత్రం లైన్ దాటకుండా ఉండడం వల్ల సక్రమమైన వాతావరణం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper