Homeఆంధ్రప్రదేశ్‌TV5 Sambasiva Rao : టీవీ5 సాంబశివ సార్ చెప్పిన ‘కోడి’ కథ

TV5 Sambasiva Rao : టీవీ5 సాంబశివ సార్ చెప్పిన ‘కోడి’ కథ

TV5 Sambasiva Rao : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ప్రస్తుతం బిఆర్ నాయుడు కొనసాగుతున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కాకముందు.. టీవీ5 న్యూస్ ఛానల్ అధినేతగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు.. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ బాధితులను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనప్పటికీ.. ఆయన ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విప్లవాత్మకమైన మార్పులకు […]

TV5 Sambasiva Rao : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ప్రస్తుతం బిఆర్ నాయుడు కొనసాగుతున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కాకముందు.. టీవీ5 న్యూస్ ఛానల్ అధినేతగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు.. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ బాధితులను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనప్పటికీ.. ఆయన ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.

బీఆర్ నాయుడు ఏర్పాటుచేసిన టీవీ5 ఛానల్ లో కీలకమైన ఉద్యోగిగా సాంబశివరావు పనిచేస్తున్నారు. ప్రైమ్ టైం లో డిబేట్ లు నిర్వహిస్తూ.. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. వైసీపీ అనగానే సాంబశివరావు ఒంటి కాలు మీద లేస్తారు. పైగా విశ్లేషణను తనకు మాత్రమే సాధ్యమైన భాష లో చెబుతుంటారు. ఈ విశ్లేషణను కొంతమంది విభేదిస్తారు. మరి కొంతమంది స్వాగతిస్తారు. ఎవరు ఎలా అనుకున్నప్పటికీ సాంబశివరావు మాత్రం తన ధోరణి మార్చుకోరు. పైగా, తనకు మాత్రమే సాధ్యమైన భాషలో చర్చ వేదికను కొనసాగిస్తారు.

ఇటీవల టీవీ 5 ఛానల్ లో ఓ చర్చా వేదిక జరిగింది. ఈ క్రమంలో సాంబశివరావు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టారు.. ఆ సమయంలో ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్లు బీఆర్ నాయుడు తనను, మూర్తిని కాపాడారని సాంబశివరావు పేర్కొన్నారు. వాస్తవానికి ఇది డిబేట్ తో సంబంధం లేకపోయినప్పటికీ సాంబశివరావు ఆ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో సమయం దొరికితే చాలు సాంబశివరావు బీఆర్ నాయుడు గురించి ప్రస్తావిస్తున్నారు.

సాంబశివరావు మాట్లాడిన మాటలను.. డిబేట్ కు సంబంధించిన వీడియోలను సహజంగానే వైసిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తారు. ఇప్పుడు సాంబశివరావు కోడి వీడియోకు సంబంధించిన మాటలను వైసిపి నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వార్తలను వార్తల మాదిరిగా చెప్పకుండా.. విశ్లేషణను విశ్లేషణ మాదిరిగా చేయకుండా ఈ కోడి స్టోరి ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సాంబశివరావు ఎలా స్పందిస్తారో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper