Jubilee Hills Society Elections: బాగా బలిసిన వాళ్ళు.. ఆగర్బ శ్రీమంతులు.. ఆడి.. బెంజ్.. ఫార్చునర్ కార్లలో తిరిగేవాళ్లు.. మరోసారి టీవీ5 బిఆర్ నాయుడుకే జై కొట్టారు. ఆయన నాయకత్వాన్ని సమర్థించారు. ఇదేంటి బిఆర్ నాయుడు ఉండేది ఆంధ్రప్రదేశ్లో కదా.. పైగా ఆయన టీటీడీ చైర్మన్ కదా.. ఇక్కడ ఎందుకు పోటీ చేస్తారు.. అదే కదా మీ డౌట్..
బిఆర్ నాయుడు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. టిటిడి చైర్మన్ అయ్యారు. దీనికంటే ముందు ఆయన జూబ్లీహిల్స్ సొసైటీలో కీలక వ్యక్తిగా కొనసాగేవారు.. ఈయనకు.. ఎన్ టివి నరేంద్ర చౌదరికి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండేది. రెండు బలమైన మీడియా సంస్థలు కావడం.. ఇద్దరు ఆర్థికంగా బలమైన వ్యక్తులు కావడంతో పోటీ రసవత్తరంగా ఉండేది. బీఆర్ నాయుడు ఇప్పుడు టిటిడి చైర్మన్ కావడంతో జూబ్లీహిల్స్ సొసైటీలో తన కుమారుడిని పోటీలోకి నిలబెట్టాడు. గత పర్యాయం బి ఆర్ నాయుడు కుమారుడే జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించాడు.
ఈ దఫా జరిగిన ఎన్నికల్లో బొల్లినేని శీనయ్య మీద బిఆర్ నాయుడు కుమారుడు రవీంద్రనాథ్ పోటీపడ్డారు. ఈసారి కూడా బిఆర్ నాయుడు కుమారుడే విజయం సాధించారు. బొల్లినేని శీనయ్యకు నరేంద్ర చౌదరి తెర వెనుక సపోర్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కొంతమంది కూడా శీనయ్య వెనుక ఉన్నారని సమాచారం. బి ఆర్ నాయుడు కుమారుడు మాత్రం అందరినీ కలుపుకొని పోయారు. సొసైటీ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో చాలామందికి ఆయన మీద నమ్మకం ఏర్పడింది. దీనికి తోడు గతంలో జరిగిన అక్రమాలను బిఆర్ నాయుడు కుమారుడు బయటికి తీసుకొచ్చారు. అందులో ఉన్న వ్యక్తులను బయటపెట్టారు. దీంతో నాయుడు కుమారుడికి అడ్డు లేకుండా పోయింది.
జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల ప్రచారాన్ని బిఆర్ నాయుడు కుమారుడు వినూత్నంగా నిర్వహించారు. సొంత ఛానల్ కాకుండా.. ఇతర చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఫలితంగా మరోసారి నాయుడు కుమారుడి మీద అందరికీ నమ్మకం ఏర్పడింది. అందువల్లే ఆయన రెండోసారి కూడా విజయం సాధించగలిగారు. తండ్రి టిటిడి చైర్మన్.. కుమారుడు జూబ్లీ సొసైటీ చైర్మన్.. మొత్తానికి టీవీ5 యజమాని ఇంట్లో పదవుల పంట పండుతోంది. అన్నట్టు ఆ మధ్య బిఆర్ నాయుడు వీడియోలను వైసిపి విడుదల చేసింది. కొద్దిరోజులు నెగిటివ్ వార్తలను ప్రసారం చేసింది. జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో కూడా బిఆర్ నాయుడు కుమారుడికి వ్యతిరేకంగా న్యూస్ పబ్లిష్ చేసింది. కానీ బి.ఆర్ నాయుడు కుమారుడు గెలవగానే.. అసలు అది వార్త కాదు అన్నట్టుగా పక్కనపెట్టింది. పాపం సాక్షి..