Homeఆంధ్రప్రదేశ్‌Janasena Party : జనసేన బాధ్యతల నుంచి తప్పుకున్న సీనియర్!

Janasena Party : జనసేన బాధ్యతల నుంచి తప్పుకున్న సీనియర్!

Janasena Party : జనసేన( janasena ) ఆవిర్భావం నుంచి పవన్ వెంట చాలామంది నేతలు అడుగు వేశారు. ప్రారంభం నుంచి మెగా అభిమానులతో పాటు చాలామంది వ్యక్తులు వెంట నడిచారు. అటువంటి వారిలో సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేనలో అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. తనను అన్ని పదవుల నుంచి తప్పించాలని అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఉంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటీషన్ ఇందుకు కారణంగా చూపారు.

* అసంతృప్తితో అంటూ ప్రచారం..
అయితే పొలిటికల్ వర్గాల్లో మరో ప్రచారం ఉంది. పదవుల్లో బొలిశెట్టి సత్యనారాయణకు( Bolisetty Satyanarayana ) ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఆయన అసంతృప్తికి గురైనట్లు ఒక ప్రచారం అయితే మాత్రం ఉంది. కానీ ఆయన మాత్రం తాత్కాలికంగా తప్పుకుంటున్నానే కానీ.. అధిష్టానం కోరుకుంటే మళ్ళీ బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇతర అనుబంధ సంఘాల్లో సైతం ఆయనకు పదవులు ఉన్నాయి. వాటన్నింటి నుంచి తప్పుకుంటున్నట్లు ఈరోజు ట్వీట్ చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖను కూడా జత చేశారు. కొన్నేళ్ల కిందట ఏపీలో కాలుష్యానికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు గాను నైతిక బాధ్యత వహిస్తూ జనసేన పదవుల నుంచి తప్పుకున్నట్లు బొలిశెట్టి ప్రకటించారు.

* నైతిక బాధ్యత అంటూ..
ప్రభుత్వంపై వేసిన ఓ కేసులో పిటిషనర్ గా ఉన్నందున… నైతిక విరామం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న తన పాత్రల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడం అవసరం అన్నారు. పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో.. ఒక నైతిక బాధ్యతగా తీసుకుని చేస్తున్న న్యాయపోరాటం రాజకీయ కారణాల వల్ల ప్రభావితం కాకూడదని నిర్ధారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు బొలిశెట్టి. అయితే అప్పుడే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది. రెండేళ్ల కాలంలో కూటమి వైఫల్యాలకు భయపడి జనసేన కీలక నేత బయటకు వెళ్లిపోయారని వైసిపి అనుకూల మీడియా సైతం ప్రచారం చేస్తోంది. కానీ బొలిశెట్టి మాత్రం నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై జనసేన నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular