BR Naidu: సరిగ్గా కొన్ని సంవత్సరాలు క్రితం నూనె రాసుకుంటే జుట్టు పెరుగుతుందని… దాని పేరు న్యూజన్ అని ఓ సంస్థ ప్రచారం చేసింది. అయితే అది రుద్దుకుంటే జుట్టు కొత్తగా రాకపోగా.. ఉన్నది కూడా ఊడిపోతుందని ఆంధ్రజ్యోతి రాసింది. ఏకంగా బ్యానర్ స్థాయిలో వార్తలు ప్రచురించడంతో.. న్యూజెన్ యాజమాన్యం ఆంధ్రజ్యోతి పత్రికకు మెయిన్ లో క్వార్టర్ స్పేస్ లో ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత న్యూజన్ పై నెగిటివ్ వార్తలను ఆపేసింది. న్యూజన్ హెయిర్ ఆయిల్ ను బి ఆర్ నాయుడు ఆధ్వర్యంలోని కంపెనీ తయారు చేస్తోంది. అప్పట్లో ఆంధ్రజ్యోతి తన ఉత్పత్తిపై నెగిటివ్ గా వార్తలు రాసిన విధానాన్ని బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని టీవీ5 ఖండించింది. కాకపోతే అప్పుడు టీవీ5 కి ఉన్న రీచ్ తక్కువ కాబట్టి.. అంత ఎఫెక్ట్ దక్కలేదు.
అప్పటినుంచి టీవీ5, ఆంధ్రజ్యోతికి ఉప్పు నిప్పు మాదిరిగానే వ్యవహారం కొనసాగుతూ ఉండేది. ఇప్పుడిక టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు. అప్పటినుంచి ఆంధ్రజ్యోతి ఏదో ఒక విధంగా వార్తలు రాస్తూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలను గత ప్రభుత్వానికి ముడిపెట్టిన ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు ఏకంగా బిఆర్ నాయుడుని టార్గెట్ చేసింది. కాకపోతే పరోక్షంగా వార్తలు రాస్తోంది. తాజాగా ఏపీ ఎడిషన్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో గాడి తప్పిన పరిపాలనకు సంబంధించి ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని రాసింది. దీని అందరికి కారణం శ్యామల రావని స్పష్టం చేసింది. శ్యామల రావు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో ప్రతిష్టంభన ఏర్పడిందని ఆంధ్రజ్యోతి స్పష్టం చేసింది. భక్తులకు సదుపాయాలు కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్య విఫలమైందని.. ఇవన్నీ కూడా శ్యామలరావు వాళ్ళనే జరిగాయని స్పష్టం చేసింది ఆంధ్రజ్యోతి.
అక్కడ ఎందుకు ఉంచినట్టు
2024 నుంచి శ్యామలరావు అక్కడ ఉన్నారు. సౌకర్యాల కల్పనలో ప్రతిష్టంభన ఏర్పడితే శ్యామల రావును అక్కడ ఎందుకు ఉంచినట్టు.. ఆయనను ఆ స్థానం నుంచి తప్పించి భక్తులకు సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారు.. మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హవా కొనసాగుతుంటే టిటిడి చైర్మన్ ఏం చేస్తున్నట్టు? ఈ లెక్కన బి.ఆర్ నాయుడు బలహీనుడు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ప్రచారం చేస్తోంది అనుకోవాలా. ఆంధ్రజ్యోతి రాసిన కథనం ద్వారా కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు అని భావించాలా.. రేపట్నాడు ఏవైనా తప్పులు జరిగితే దానికి అనిల్ సింఘాల్ దే బాధ్యత అంటారేమో.. అప్పట్లో శ్యామలరావును నియమించినప్పుడు ” జగన్ చూసి నేర్చుకో.. చంద్రబాబును చూసి సమర్థవంతమైన అధికారులను ఎంపిక చేయడం ఎలాగో తెలుసుకో” అంటూ కూటమి నేతలు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి కూడా అలాగే వార్తలు రాసింది. మరి ఇప్పుడు మాత్రం ఏకంగా శ్యామలరావుదే తప్పు అన్నట్టుగా. వార్తను ప్రచురించింది.. మరి దీనిపై కూటమినేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.