Pakistan economic crisis : పాకిస్తాన్.. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళు అయినా.. ఆ దేశం ఇప్పటికీ అప్పుల మీద ఆధారపడే బతుకుతోంది. అభివృద్ధికన్నా.. ఉగ్రవాదానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడమే ఈ పరిస్థితికి కారణం. అపారమైన వనరులు, సారవంతమైన భూములు ఉన్నా.. జనాభా పెరుగుదల, రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం, ఉగ్రవాదం ఆదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు పశ్చిమాసియా యుద్ధం మరింత ఇబ్బందికరంగా మారింది. యుద్దంలో ఎవరి పక్షాన నిలవాలో తెలియని సందిగ్ధంలో ఉంది. యూఏఈతో డిఫెన్స్ డీల్ ఉంది. దాని ప్రకారం పాకిస్తాన్ ఇరాన్‌పై యూఏఈ తరఫున దాడి చేయాలి. కానీ సైలెంట్‌గా ఉంటోంది. దీంతో యూఏఈ తాము ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల అప్పు తీర్చాలని పాకిస్తాన్‌పై ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. తాజాగా 2 బిలియన్ డాలర్లు పాక్‌కు అందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించి, ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. మార్చి 27 నాటికి పాక్ వద్ద 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఈ సాయంతో ఆర్థిక ఒత్తిడి తాత్కాలికంగా తగ్గనుంది.
యూఏఈ షాక్..
సౌదీ సహాయం ఆనందంలో మునిగి ఉన్న పాక్‌కు యూఏఈ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. గతంలో యూఏఈ నుంచి తీసుకున్న 3.5 బిలియన్ డాలర్ల (రూ.32 వేల కోట్లు) రుణాన్ని ఈ నెలలోనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. పాక్ ప్రభుత్వం ఈ రుణాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది. సౌదీ సహాయంతో ఈ నెలాఖరులోగా చెల్లించే అవకాశం ఉంది.
షెహబాజ్ సౌదీ పర్యటన..
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. బుధవారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ను కలిసి, ద్వైపాక్షిక ఆర్థిక, రక్షణ అంశాలపై చర్చించారు. మరో బిలియన్ డాలర్లు సాయం, రుణాల పొడిగింపు కోరికలు చర్చల్లో ఉన్నాయని సమాచారం.
ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్..
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైంది. విదేశీ ఋణాలు జీడీపీకు 90 శాతంకు పైగా ఐఎంఎఫ్, చైనా, సౌదీ, యూఏఈపై ఆధారపడి ఉంది. మారక నిల్వలు 16.4 బిలియన్ డాలర్లు 3 నెలల ఇంపోర్ట్‌కు సరిపోతాయి. యూఏఈ రుణం చెల్లించడంతో మరింత క్షీణించనున్నాయి. సౌదీ 2023 నుంచి 5 బిలియన్ డాలర్లు సాయం. ఇది తాత్కాలిక ఊపిరి. యూఏఈ రుణం తిరిగి తీర్చమంటూ ఒత్తిడి పెంచడం పాక్‌కు షాక్ ఇచ్చింది.
పాకిస్తాన్ అప్పుల ఊబిలో మునిగిపోతోంది. సౌదీ 2 బిలియన్ సాయం తాత్కాలిక ఊపిరి ఇచ్చినా, యూఏఈ 3.5 బిలియన్ రుణ ఒత్తిడి కొత్త సమస్య. మారక నిల్వలు క్షీణిస్తుండగా, షెహబాజ్ సౌదీ పర్యటలో మరిన్ని సాయాలు కోరుతున్నారు. ఐఎంఎఫ్, చైనా మీద ఆధారపడి ఉన్న పాక్, స్థిరమైన సంస్కరణలు చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది.