Homeఅంతర్జాతీయంSaudi Arabia : పాకిస్తాన్ దారుణంగా మోసం చేసింది.. సౌదీ ‘ఇజ్రాయెల్’ శరణు వేడింది!

Saudi Arabia : పాకిస్తాన్ దారుణంగా మోసం చేసింది.. సౌదీ ‘ఇజ్రాయెల్’ శరణు వేడింది!

Saudi Arabia : మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. చేసుకున్న ‘మక్కా’ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాకు పాకిస్థాన్‌ నుంచి ఆశించిన స్థాయిలో సైనిక మద్దతు లభించకపోవడంతో.. రియాద్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ నమ్మించి సౌదీ గొంతుకోసింది. దీంతో సౌదీ తన శత్రువైనా సరే.. ఇజ్రాయెల్‌ నుంచి సాంకేతిక సహాయం కోరినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. హూతీలతో పెరుగుతున్న ముప్పు యెమెన్‌కు చెందిన ఇరాన్‌ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర […]

Saudi Arabia : మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. చేసుకున్న ‘మక్కా’ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాకు పాకిస్థాన్‌ నుంచి ఆశించిన స్థాయిలో సైనిక మద్దతు లభించకపోవడంతో.. రియాద్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ నమ్మించి సౌదీ గొంతుకోసింది. దీంతో సౌదీ తన శత్రువైనా సరే.. ఇజ్రాయెల్‌ నుంచి సాంకేతిక సహాయం కోరినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

హూతీలతో పెరుగుతున్న ముప్పు

యెమెన్‌కు చెందిన ఇరాన్‌ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర ప్రాంతంలో కార్యకలాపాలను తీవ్రతరం చేసినట్లు సమాచారం. సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరపడంతో పాటు.. కీలకమైన సముద్ర మార్గాలపై తమ పట్టును పెంచుకునేందుకు హూతీలు ప్రయత్నిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రం వైపు వెళ్లే నౌకలకు ఈ మార్గం ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు దిగజారితే చమురు, ఇతర వాణిజ్య సరకు రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌ నుంచి ఆశించిన సాయం దక్కలేదా?

సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల మధ్య చాలాకాలంగా సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి. మక్కా త్రైపాక్షిక రక్షణ ఒప్పందంలో పాకిస్థాన్‌, తుర్కియే, సౌదీ అరేబియాలు భాగస్వాములుగా ఉన్నాయి. అంతేకాకుండా సౌదీతో పాకిస్థాన్‌కు ప్రత్యేక రక్షణ సహకార ఒప్పందాలు కూడా ఉన్నాయి. అయితే యెమెన్‌లో హూతీలతో ప్రత్యక్షంగా పోరాడే విషయంలో పాకిస్థాన్ వెనుకడుగు వేసినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో సంక్షోభ సమయంలో తనకు అండగా నిలుస్తుందని భావించిన ఇస్లామాబాద్‌ నుంచి తగిన మద్దతు రాకపోవడంతో సౌదీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌ వైపు సౌదీ చూపు?

ఇజ్రాయెల్‌ను సౌదీ అరేబియా ఇప్పటికీ అధికారికంగా గుర్తించలేదు. ఇరు దేశాల మధ్య అధికారిక దౌత్య సంబంధాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ నుంచి సాంకేతిక సహాయం కోరినట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హూతీల డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్‌కు ఉన్న అధునాతన నిఘా, వైమానిక రక్షణ సాంకేతికతపై సౌదీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ మధ్యవర్తిత్వం వహిస్తూ ఇరు దేశాల మధ్య పరోక్ష సంప్రదింపులకు సహకరించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

అమెరికా పాత్ర కీలకం?

సౌదీకి అమెరికాతో ఇప్పటికే బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. హూతీల ముప్పు నేపథ్యంలో సౌదీ భద్రతకు సంబంధించిన అంశాల్లో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్‌ వద్ద ఉన్న సాంకేతిక సామర్థ్యాలను సౌదీకి అందుబాటులోకి తీసుకురావడంలో అమెరికా మధ్యవర్తిత్వం ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మారుతున్న మధ్యప్రాచ్య సమీకరణాలు

ఒకవైపు పాకిస్థాన్‌తో రక్షణ భాగస్వామ్యం కొనసాగుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్‌ సాంకేతిక సామర్థ్యాల వైపు సౌదీ చూస్తున్నట్లు వస్తున్న వార్తలు మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా భావిస్తున్నారు.

హూతీల ముప్పు మరింత పెరిగితే సౌదీ అరేబియా తన భద్రత కోసం మరిన్ని దేశాలతో వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పటివరకు ప్రత్యర్థి శిబిరాలుగా కనిపించిన దేశాల మధ్య కూడా భద్రతా అవసరాల ఆధారంగా కొత్త రహస్య లేదా పరోక్ష సంబంధాలు ఏర్పడే అవకాశముంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper