Singer Mangli Bigg Boss 10: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో మన అందరికీ తెలిసిందే. గత సీజన్ ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని బిగ్ బాస్ సీజన్స్ కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎమోషన్స్ రోలర్ కోస్టర్ లాగా సాగిన ఈ సీజన్ కి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేశారు . అందుకే సీజన్ 10 పై ప్రేక్షకుల్లో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే , ఎక్కడా తగ్గకుండా, భారీ లెవెల్ లో ఈసారి ‘బిగ్ బాస్ 10′(Bigg Boss 10 Telugu) ని ప్లాన్ చేస్తున్నారు టీం. అయితే గత సీజన్ లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.
త్వరలోనే ‘అగ్నిపరీక్ష 2’ ప్రోగ్రాం కూడా మొదలు అవ్వబోతుంది. అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కూడా టాప్ రేంజ్ వాళ్ళని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను సంప్రదించారట. అందులో సింగర్ మంగ్లీ కూడా ఉంది. జానపద గీతాలతో ఈమె యూత్ ఆడియన్స్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా ప్రతీ శుక్రవారం రోజున విడుదలయ్యే సినిమాల్లో ఈమె పాడిన పాట ఒక్కటి అయినా ఉండాల్సిందే. ఆ రేంజ్ డిమాండ్ ఉన్న సింగర్ ఈమె. అయితే బిగ్ బాస్ యాజమాన్యం గత రెండు మూడు సీజన్స్ నుండి కాంట్రవర్సిలు ఉన్న సెలబ్రిటీలను కచ్చితంగా కంటెస్టెంట్స్ గా తీసుకోవాలి అనే రూల్ పెట్టుకున్నారు. అందుకే గత సీజన్ లో దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య వంటి వారు కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
మంగ్లీ ని ఈ సీజన్ కోసం ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణమని అంటున్నారు. ఒకపక్క మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సింగర్ , మరోపక్క రీసెంట్ గా ఆమెపై వస్తున్న అభియోగాల వల్ల సోషల్ మీడియా లో ఏర్పడిన వివాదాలు , ఇవన్నీ తమ షో కి బజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే ఆమెని ఎంచుకున్నారట. అయితే ఈ షో లో పాల్గొనడం కోసం ఆమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వారానికి 5 లక్షల రూపాయిలు అడుగుతుంది. అంటే ఒకవేళ ఈమె 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగితే, 75 లక్షల రూపాయిలు ఇవ్వాలి అన్నమాట. ఈ రెమ్యూనరేషన్ విషయం లోనే యాజమాన్యం తో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎలా అయినా ఈమె ని ఈ షోకి తీసుకొని రావాలనే పట్టుదలతో ఉన్నారట.