Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh education reforms : ఇదిగో ఇదే లోకేష్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది.. రేపటి...

Nara Lokesh education reforms : ఇదిగో ఇదే లోకేష్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది.. రేపటి నాడు నిలబెట్టబోయేది..

Nara Lokesh education reforms : ఎస్.. లోకేష్ నూటికి నూరు శాతం కాదు అంతకుమించి పనిచేస్తున్నాడు. అందులో అనుమానం లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. తన శాఖను మాత్రమే అతడు పర్యవేక్షిస్తున్నాడు. అందులో నూటికి నూరు శాతం ఫలితాలను సాధిస్తున్నాడు. మధ్యాహ్న భోజనం.. అమ్మ ఒడి.. పిల్లలకు స్కూల్ డ్రెస్సులు.. పాఠ్యపుస్తకాలు.. అధునాతనమైన లైబ్రరీలు.. డిజిటల్ బోర్డులు.. స్కూళ్లలో మరుగుదొడ్లు.. మూత్రశాలలు.. తాగునీటి సౌకర్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇదేమి ఒక రోజులో అయింది కాదు. తను కూడా మధ్యాహ్న భోజనం తింటున్నాడు. ప్రత్యేకంగా మెనూ చేయించడం లేదు. ఇటీవల ఓ పిల్లాడి ప్లేట్లో అన్నం తిన్నాడు. ఆ తర్వాత ఆ ప్లేట్ కాడికి ఇచ్చేశాడు.

ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తారని ఎవరైనా ఊహించారా.. గిట్టని వాళ్లు పిఆర్ టీమ్ చేస్తున్న మాయాజాలం అంటూ కొట్టి పారేయవచ్చు. కానీ గతంలో అధికారంలో ఉన్నవాళ్లు ఎన్నడూ ఇలాంటి పనిచేయలేదు కదా. మధ్యాహ్న భోజనం బాగోలేదంటే.. తిన్నది అరగక చేస్తున్నారని ఆరోపించిన మంత్రులు నాటి ప్రభుత్వంలో ఉన్నారు. కానీ నేడు లోకేష్ అలా కాదు. మధ్యాహ్న భోజనం మీద నిత్యం మానిటరింగ్ జరుగుతూనే ఉంది. ఎక్కడ లోపం ఉన్నా సరే.. వెంటనే దిద్దుబాటు చర్యలు జరిగిపోతున్నాయి. అందువల్లే కదా ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ రేట్లు పూర్తిగా తగ్గిపోయాయి. చివరికి మన్యం ప్రాంతంలో కూడా డ్రాప్ అవుట్ రేట్లు లేవంటే నారా లోకేష్ పనితీరును అర్థం చేసుకోవచ్చు.

నారా లోకేష్ మనోగతానికి.. తన దూర దృష్టికి నిదర్శనం మనబడి. వాస్తవానికి ఈ మ్యాగజైన్ ఇటీవల కాలంలో ఏపీలో విద్యాశాఖ సాధించిన విప్లవాత్మక మార్పులను అందిస్తోంది. కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్పగా ఎదిగిన వారి విజయ గాధలను కూడా ఈ మ్యాగజైన్ బయటపెడుతోంది. ఒక రకంగా దీనిని నారా లోకేష్ మానస పత్రిక అనుకోవచ్చు. మన్యం నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు.. కృష్ణ నుంచి మొదలుపెడితే గుంటూరు వరకు.. ప్రతి పాఠశాలలో జరిగే ఆక్టివిటీ మొత్తం ఇందులో కనిపిస్తోంది. విజయ గాధలు.. స్ఫూర్తి నింపే పాఠాలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతి అంశాన్ని ఇందులో పొందుపరుస్తున్నారు.

అందువల్లే మనబడి జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్చించింది. 2019 నుంచి 2024 వరకు మనబడి అనేది కాలగర్భంలో కలిసిపోయింది. నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనబడి కొత్త ఊపిరి అందుకుంది. ఆ తర్వాత ఏపీ విద్యాశాఖ పనితీరుకు ఒక లిట్మస్ పేపర్ లాగా మారిపోయింది. ప్రతి నెల వచ్చే కథనాల కోసం విద్యార్థులే కాదు.. ఉపాధ్యాయులు.. విశ్రాంత ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు అంటే ఆ మ్యాగ్జిన్ నడుపుతున్న నడుపుతున్న తీరు.. నడిపిస్తున్న తీరు అర్థం చేసుకోవచ్చు.

చివరిగా గొప్ప మార్గాలు నిర్మించాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. గొప్ప వ్యక్తిత్వం పాటించే వ్యక్తికి విలువలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నారా లోకేష్ మనబడిని తట్టి లేపారు. పునరుజ్జీవనం పొందించి.. కొత్తగా నిలబెట్టారు. శభాష్ నారా లోకేష్..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular