Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: చంద్రబాబు రాజనీతిని తప్పు పడితే ఎలా?

CM Chandrababu: చంద్రబాబు రాజనీతిని తప్పు పడితే ఎలా?

CM Chandrababu: ఏపీకి ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో ప్రాధాన్యం ఇస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కానీ తొలి పదేళ్లలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి ఏపీలో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలు, అంతర్జాతీయ […]

CM Chandrababu: ఏపీకి ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో ప్రాధాన్యం ఇస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కానీ తొలి పదేళ్లలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి ఏపీలో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు.. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ. ఏపీ విషయంలో ప్రధాని మోదీ అభిప్రాయం కూడా మారింది. అందుకే మోడీని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే దానిని కొందరు తప్పుగా భావిస్తున్నారు. పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు.

* పూడ్చుకోలేని నష్టం..
ఏపీ సీఎం చంద్రబాబు ఒకానొక దశలో ఈగోకు దిగడం ఖాయమే. దాని పర్యవసానంగానే ఆయన బిజెపితో పాటు ఎన్డీఏకు దూరమయ్యారు. మోదీని వ్యతిరేకించి చేతులు కాల్చుకున్నారు. అందుకే తన వైఖరిని మార్పు చేసుకున్నారు. తన ఈకోను పక్కన పెట్టేసి తనను నమ్మి ఓట్లు వేసిన కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీని పదేపదే ప్రశంసిస్తున్నారు. దీనిపై విశ్లేషకుల రూపంలో కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రశంసల వెనుక ఒక బలమైన వ్యూహం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. లౌక్యంతో కూడిన పరిపక్వ రాజకీయ విధానాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

* రాష్ట్ర ప్రయోజనాల కోసం..
విభజన గాయాలు ఇంకా ఏపీకి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయ కోణంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదించడం, వ్యక్తిగత ఈగోలకు వెళ్లి ఉన్న సంబంధాలను పెంచుకోవడం మంచిది కాదు. 2014 నుంచి 2019 మధ్య ఈగోల వరకు వెళ్లి నష్టపోయారు. రాష్ట్రం కూడా ఎంతో నష్టపోయింది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్ర నాయకత్వాన్ని బహిరంగంగా కొనియాడటం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టును, ప్రతి రూపాయిని రాబట్టుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం కొనసాగుతోంది.

* ఎన్నో సత్ఫలితాలు..
చంద్రబాబును రాజకీయంగా విభేదించవచ్చు. కానీ గత రెండేళ్లలో జరుగుతున్న పరిణామాలు గ్రహిస్తే మాత్రం.. గతానికి భిన్నం అని ఒప్పుకోక తప్పదు. అదంతా ఎన్నికల ఫలితాల రూపంలో వచ్చిన కారణం ఒకటి అయితే.. చంద్రబాబు రాజనీతికి దక్కుతున్న ఫలితం కాకూడదు పేర్కొనవచ్చు. 2014లో కూడా టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లోనే అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. అప్పట్లో రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేశారు. కానీ ఈసారి మాత్రం 15 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సర్దుబాటు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా 12 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపుగా ఓ 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక ప్యాకేజీలు అందించారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇవన్నీ చంద్రబాబు తన ఈగోను పక్కన పెట్టడం వల్లే సాధ్యమైంది. ఒక్కరు ఒక ఈగోను పక్కన పెట్టారు అంటే దానికి బలమైన, సహేతుకమైన కారణం ఉంటుంది. చంద్రబాబు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తన వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper