Homeఎంటర్టైన్మెంట్Agni Pariksha 2 Contestants: 'అగ్ని పరీక్ష 2' ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. వీళ్ళు...

Agni Pariksha 2 Contestants: ‘అగ్ని పరీక్ష 2’ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. వీళ్ళు సామాన్యులు అంటే ఎవ్వరూ నమ్మరు..

Agni Pariksha 2 Contestants: వచ్చే నెల 6 వ తేదీన కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభం కానుంది. గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం తో ఈ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. గత సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘అగ్ని పరీక్ష’ షో. ఈ షో ద్వారా సామాన్యులను ఆడిషన్స్ ద్వారా ఎంచుకొని […]

Agni Pariksha 2 Contestants: వచ్చే నెల 6 వ తేదీన కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభం కానుంది. గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం తో ఈ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. గత సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘అగ్ని పరీక్ష’ షో. ఈ షో ద్వారా సామాన్యులను ఆడిషన్స్ ద్వారా ఎంచుకొని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఆ సామాన్యుల్లో ఒకరైన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలవడం , మరో సామాన్యుడు డిమోన్ పవన్ కూడా టాప్ 3 కంటెస్టెంట్ గా నిలవడం , సెన్సేషన్ అయ్యింది. అందుకే ‘అగ్నిపరీక్ష 2’ పైన కూడా అంచనాలు వేరే లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. మొదటి సీజన్ కేవలం ఓటీటీ కి మాత్రమే పరిమితం అయ్యింది.

కానీ రెండవ సీజన్ ని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. వచ్చే వారం నుండి ఈ షో టెలికాస్ట్ కానుంది. అయితే ఈ షో లో పాల్గొనే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో అత్యధిక శాతం మంది ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయ్యి , ఒక లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నవాళ్లే అవ్వడం గమనార్హం. వాళ్ళ లిస్ట్ ని ఇప్పుడు మీకోసం అందిస్తున్నాము. ముందుగా ‘ఫుటా తెలుగు’ అనే అతని గురించి మాట్లాడుకోవాలి. ఈయన మన ఇండియన్ కాదు , జపాన్ దేశానికీ చెందిన వాడు. కానీ తెలుగు భాష అన్నా , మన సంస్కృతి అన్నా బాగా ఇష్టం. ఇప్పటి వరకు ఆయన చేసిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి , ఆయనకు మంచి ఫాలోవింగ్ కూడా ఏర్పడింది. ఈయన ‘అగ్నిపరీక్ష 2’ లో పాల్గొనబోతున్నాడు .

ఇక ‘అగ్నిపరీక్ష 2’ లో పాల్గొనబోతున్న రెండవ కంటెస్టెంట్ ‘ఆర్సీకే’. ఇన్ స్టాగ్రామ్ ని ఉపయోగించే జెన్ జీ ఆడియన్స్ కి ఈయన బాగా సుపరిచితమే. ఈయన ప్రతీ వీడియో కి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తుంటాయి. ఇక 3 వ కంటెస్టెంట్ పేరు ‘అపర్ణ లేడీ టైగర్’. ‘బిగ్ బాస్ 9 ‘ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల లాగానే ఈమె కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చింది. అదే విధంగా 4 వ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే , ఇతని పేరు ‘vaxin’ . ఇతనికి ఇన్ స్టాగ్రామ్ లో నెగెటివిటీ బాగానే ఉంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిన ‘అక్షయ్’ కూడా ‘అగ్నిపరీక్ష’ షో లో పాల్గొనబోతున్నాడు. ఈయన ఎక్కువగా సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ కుమారి డయానా , పంపరీ భరత్, నేమి షాలిని, భరత్ వి , వాటర్ సోల్ , ప్రదీప్ , మ్యాడ్ రోసీ , సాక్షి రాజపుట్ , మిస్ అపూర్వ , యాంకర్ ప్రియా వంటి వారు ఈ షో లో పాల్గొనబోతున్నారు. వీళ్లకు సంబంధించిన ఫోటోలు ఈ క్రింది వీడియో లో అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper