Vaishnavi Chaitanya: బోనాలు పండుగ ని తెలంగాణ ప్రజలు ఎంత వైభోగంగా జరుపుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హైదరాబాద్ సిటీ నుండి , మారు మూల తెలంగాణ గ్రామం వరకు , ఈ బోనాల జాతర వచ్చిందంటే , అమ్మవారి దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. ఇలాంటి సమయం లోనే కొంత మంది సినీ సెలబ్రిటీలను కూడా దేవాలయాల్లో చూసే అరుదైన అవకాశం కలుగుతూ ఉంటుంది సామాన్య భక్తులకు. తెలంగాణ ప్రాంతం నుండి సినీ ఇండస్ట్రీ కి చెందిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో ప్రముఖ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి , ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఈమె, ‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో ఎలా అయితే ఈమె బోనాలు ఎత్తుతూ అమ్మవారి దేవాలయాల్లో కనిపించేదో , ఇప్పటికీ కూడా అలాగే కనిపిస్తోంది. ప్రతీ ఏడాది బోనాలు సమర్పించుకుంటూ వచ్చిన వైష్ణవి చైతన్య, ఈ ఏడాది కూడా బోనాలు సమర్పించుకుంది. నిన్న సికిందరాబాద్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య, ఆ తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించుకొని , అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్దం గా పట్టు చీరలో కనిపించిన వైష్ణవి చైతన్య ని చూస్తుంటే తెలుగుదనం ఉట్టిపడుతోంది. ఆలయం లోకి అడుగుపెట్టిన వెంటనే ఆమెని అభిమానులు చూసి కేరింతలు కొట్టారు. అనంతరం ఆలయ అధికారులు వైష్ణవి చైతన్య కి ఘనంగా స్వాగతం పలికి , ఆమెకు వేదాశీర్వవచనంతో పాటు అమ్మవాటి తీర్థ ప్రసాదనలను అందజేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది , దాన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
ఇక వైష్ణవి చైతన్య సినిమాల విషయానికి వస్తే , ఈమె నుండి విడుదలైన చివరి చిత్రం ‘జాక్’. సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించిన ఈ సినిమా గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య స్క్రిప్ట్స్ ఎంపిక పై కాస్త జాగ్రత్త వహిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆనంద్ దేవరకొండ తో కలిసి ‘ఎపిక్ ‘ అనే చిత్రం చేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత , ఇదే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ హీరో గా నటిస్తున్న చిత్రం లో కూడా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆమె రేంజ్ బాగా పెరగొచ్చు , చూడాలి మరి ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.