Homeవింతలు-విశేషాలుViral Husband Video: పెళ్ళాం మటన్ తెమ్మంటే చికెన్ తెచ్చాడు.. వరద నీటిలో కూర్చున్నాడు.. పాపం...

Viral Husband Video: పెళ్ళాం మటన్ తెమ్మంటే చికెన్ తెచ్చాడు.. వరద నీటిలో కూర్చున్నాడు.. పాపం ఈ భర్త

Viral Husband Video: జోరుగా వర్షం పడుతోంది. దానికి తగ్గట్టుగానే ఒక వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్పటికే రాకపోకలు ఆగిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆ జోరుగా ప్రవహిస్తున్న వాగు మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. చుట్టుపక్కల వారు వారిస్తున్నప్పటికీ.. ఆ వ్యక్తి బయటికి రాలేదు. కనీసం రావాలని కూడా అనుకోలేదు. ఆ వాగులో కొట్టుకుపోయినా పర్వాలేదు.. అలానే ఉండాలని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి నీటికి ఎదురు ఈదడం చేపకు అలవాటు.. మనుషులకు అది […]

Viral Husband Video: జోరుగా వర్షం పడుతోంది. దానికి తగ్గట్టుగానే ఒక వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్పటికే రాకపోకలు ఆగిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆ జోరుగా ప్రవహిస్తున్న వాగు మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు.

చుట్టుపక్కల వారు వారిస్తున్నప్పటికీ.. ఆ వ్యక్తి బయటికి రాలేదు. కనీసం రావాలని కూడా అనుకోలేదు. ఆ వాగులో కొట్టుకుపోయినా పర్వాలేదు.. అలానే ఉండాలని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి నీటికి ఎదురు ఈదడం చేపకు అలవాటు.. మనుషులకు అది సాధ్యం కాదు. కానీ అంతటి వాగుకు కూడా ఎదురుగా ఉండాలని.. ఏమైనా పర్వాలేదని ఈ వ్యక్తి అనుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.

ఆ వ్యక్తి అలా జోరుగా ప్రవహించే వాగుకు ఎదురు ఉన్నడంటే.. దాని వెనుక బలమైన కారణం ఉంది.. ఆ వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. పండగ నిమిత్తం తన బావమరిది తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చాడు.. ఆ సమయంలో తన భార్య బయటకు వెళ్లి మటన్ తెమ్మని చెప్పింది. అయితే అతడు బయటికి వెళ్లగానే మటన్ లభించలేదు. దీంతో చికెన్ తీసుకొచ్చాడు. అంతే అతడి భార్య ఇల్లు పీకి పందిరేసింది. రాకరాక మా తమ్ముడు ఇంటికి వస్తే మటన్ కాకుండా చికెన్ తీసుకొస్తావా అంటూ మండి పడింది. భర్తతో తీవ్రంగా గొడవ పడింది. ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో తట్టుకోలేక ఆ భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. పెళ్లాం తిట్టిందనే బాధలో ఎవరికీ చెప్పుకోకుండా.. కనిపించనంత దూరం వెళ్లిపోయాడు. అంతటి వర్షంలో కూడా అతడు బయటకు వచ్చేశాడంటే ఏస్థాయిలో బాధ ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా అతడు తనలో తానే మదనపడ్డాడు. కన్నీటిపర్యంతమయ్యాడు. గుండెలో భారాన్ని అదిమిపెట్టుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు.

అప్పటికే జోరుగా వర్షం పడుతోంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఇంటికి వెళ్తే భార్య ఊరుకోదు. స్నేహితుల దగ్గరికి వెళ్దామంటే మనసు ఒప్పలేదు. ఇంకేముంది అతడు జోరుగా ప్రవహించే వాగు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. స్నాక్స్ తెచ్చుకుని తినడం మొదలుపెట్టాడు. వాగులో కొట్టుకుపోయిన పర్వాలేదు కానీ.. ఇంటికి వెళ్లి పెళ్ళాంతో తిట్లు తినడం నావల్ల కాదని అతడు అక్కడే కూర్చుండిపోయాడు.. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by VOICE OF SIRI (@voice.of.siri)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper