Homeబిజినెస్Vinfast VF MPV 7: రిలీజ్ అయిన Vinfast VF MPV 7.. ఫీచర్స్ తెలిస్తే...

Vinfast VF MPV 7: రిలీజ్ అయిన Vinfast VF MPV 7.. ఫీచర్స్ తెలిస్తే ఆగలేక పోతారు..

Vinfast VF MPV 7: 2026 ఏడాదిలో కంపెనీలో కొత్త కార్లు రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా Vinfast India కంపెనీ ఏప్రిల్ 15వ తేదీన కొత్త కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి Vinfast VF MPV 7 అనే ఎలక్ట్రిక్ వేరియంటును రిలీజ్ చేసింది. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. ఇందులోనూ MPV కార్ల కోసం ఎదురుచూసే వారికి విన్ ఫాస్ట్ కంపెనీ తెచ్చిన కొత్త కారుతో ఉత్సాహం నెలకొంది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా.. త్వరలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ కారు మహీంద్రా X EV9S కారుతో పోటీ పడనుంది. ఈ కార్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

Vinfast VF MPV 7 డిజైన్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన VF7 కారు మాదిరిగానే బాక్స్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి హెడ్ లాంప్స్, కారు ముందడి భాగంలో ఎల్ఈడి బార్ నిలువుగా ఉండి ఆకర్షిస్తుంది. అలాగే 19 అంగుళాల అల్లాయి వీల్స్ కనిపిస్తాయి. 18 అంగుళాల వీల్స్ అదనపు క్రోమ్ తో ఉంటూ సౌకర్యంగా ఉంటుంది. ఈ కారులో ఫీచర్స్ కూడా నేటి తరం వారిని ఆకర్షించే విధంగా ఉంటుంది. 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెచ్ యు డి డిస్ప్లే, కనెక్టెడ్ కారు టెక్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ కెమెరా, వైర్లెస్ ఫోన్ చార్జర్ వంటివి సౌకర్యాన్ని అందిస్తాయి.

ఇందులో సేఫ్టీ ఫీచర్లకు కూడా ప్రాథమిక ఇచ్చారు. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS తో కూడిన EBD, స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి సేఫ్టీని అందిస్తాయి. ఈ కొత్త కారులో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఈ బ్యాటరీ 201 హార్స్ పవర్ అందిస్తుండగా.. 400 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ARAI రేటెడ్ rang చార్జింగ్ చేయగా 517 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. 30 నిమిషాల్లో 10 నుంచి 70% వరకు చార్జింగ్ చేయడానికి DC ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీనికి మూడు సంవత్సరాల పాటు ఉచిత మెయింటెనెన్స్ ఇవ్వనున్నారు. ఏడు సంవత్సరాల వరకు వాహన గ్యారంటీ, 10 సంవత్సరాల వరకు బ్యాటరీ వారంటీ ఇవ్వనున్నారు. ఏడు సంవత్సరాల వరకు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెంట్ ప్రయోజనాలను అందించనున్నారు. ఈ కారు ధర రూ.24.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular