Mrunal Thakur Sister: ఈ జనరేషన్ స్టార్ హీరోయిన్స్ లో అందాల ఆరబోతతో పాటు, అద్భుతమైన నటన, డ్యాన్స్ చేయగల హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో మృణాల్ ఠాకూర్ పేరు కచ్చితంగా ఉంటుంది. అందాల ఆరోబాటలో ఈమెకు సాటి ఎవ్వరు లేరు , అదే విధంగా సహజమైన నటన లో కూడా ఈమెకు పోటీ ఎవ్వరు లేరు అని చెప్పొచ్చు. మన టాలీవుడ్ ఆడియన్స్ ‘సీతారామం’, ‘డెకాయిట్’, ‘హాయ్ నాన్న’ చిత్రాల్లో మృణాల్ నటనకు మంత్రం ముగ్దులు అయిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటోలు , వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ , కుర్రాళ్లలో హీట్ ఎక్కిస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.
అయితే కేవలం ఈమె మాత్రమే కాదు , ఈమె సోదరి కూడా అదే రేంజ్ అందం తో కుర్రాళ్ళని పిచ్చెక్కించే రేంజ్ లో ఉంటుంది. ఈమె పేరు లోచన్ ఠాకూర్. ఈమె మృణాల్ ఠాకూర్ కంటే ముందే సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతూ వస్తోంది. కానీ సినీ నటిగా కాదు , మేకప్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వచ్చింది. మృణాల్ ఠాకూర్ ప్రతీ సినిమాకు ఈమె పని చేస్తుంది. ఒక విధంగా సినిమాల్లోకి మృణాల్ ఠాకూర్ చాలా సులువుగా ఎంట్రీ ఇవ్వడానికి లోచన్ ఠాకూర్ కూడా ఒక కారణం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. సీరియల్ హీరోయిన్ గా జనాలకు బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ ని , ఆమె టాలెంట్ కారణంగా చాలా తొందరగా వెండితెర ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యింది. అందుకు లోచన్ ఠాకూర్ మృణాల్ సినీ ఇండస్ట్రీ లో ముందుకు వెళ్లేందుకు ఒక మెట్టు లాగా ఉపయోగపడింది అంతే.
ఇదంతా పక్కన పెడితే , వీళ్లిద్దరు అక్కా చెల్లులు లాగా కాకుండా స్నేహితులు లాగా ఉంటారు. వీళ్లకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇక మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే , రీసెంట్ గానే ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ ని ‘డెకాయిట్’ చిత్రం ద్వారా పలకరించింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత మంచి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ , పూజ హెగ్డే లతో కలిసి ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై ‘ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది.