Janasena Formation Day 2026 : ప్రతి ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఎంత గ్రాండ్ గా చేస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లక్షల సంఖ్యలో కార్యకర్తలను పోగు చేసి, కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభని నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా మారింది . ఈ ఏడాది కూడా ఈ సభని గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. ఈ సభకు ‘జెన్ జీ ‘ అని పేరు కూడా పెట్టాలని అనుకున్నారు. గత ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా పిఠాపురం లోనే ఈ బహిరంగ సభని నిర్వహించడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనని పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కారణం బిజీ షెడ్యూల్స్ వల్ల అని తెలుస్తోంది. ఆయన హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గత మూడు రోజుల నుండి ఈ సినిమాకు సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 15 న హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. బాగా టైట్ షెడ్యూల్ , పైగా సభకు ఎలాంటి ఏర్పాట్లు కూడా ప్రీ ప్లాన్ గా చేసుకోలేదు. అందుకే ప్రస్తుతానికి భారీ బహిరంగ సభని రద్దు చెయ్యాలని నిర్ణయించుకున్నారట. ముందుగా పార్టీ సభ్యత్వ కార్యక్రమం పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 14 లక్షల మంది పార్టీ సభ్యత్వాలను తీసుకోగా, ఈ విడత ఎట్టి పరిస్థితిలోనూ 20 లక్షల సభ్యత్వాలను దాటించే ప్లాన్ లో ఉన్నారట. ఈసారి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఎన్నికల సమయానికి 50 లక్షల సభ్యత్వాలను ఎట్టి పరిస్థితిలో అవ్వాలని అట. మరి ఆ టార్గెట్ ని చేరుకుంటుందో లేదో చూడాలి. అయితే అభిమానులు ఆవిర్భావ దినోత్సవం సభ రద్దు అయ్యినందుకు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, పార్టీ క్యాడర్ లో మంచి జోష్ ని నింపే కార్యక్రమం అని అంటున్నారు.