Homeఆంధ్రప్రదేశ్‌Yelahanka Palace: యలహంక ప్యాలెస్ సుగుణమ్మ పేరుపై రిజిస్ట్రేషన్? తెరపైకి సంచలన నిజం

Yelahanka Palace: యలహంక ప్యాలెస్ సుగుణమ్మ పేరుపై రిజిస్ట్రేషన్? తెరపైకి సంచలన నిజం

Yelahanka Palace: బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వ్యవహారం వైఎస్ కుటుంబంలో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తికి సంబంధించిన వివాదం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్యాలెస్ కు సంబంధించిన సుమారు 22 ఎకరాలభూమి వైఎస్ భారతి పేర్లపై రిజిస్ట్రేషన్ కావడం ఇప్పుడు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ ఆస్తి సుగుణమ్మ పేరుపై ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది? అప్పటి పరిస్థితులు ఏమిటి? అనే అంశాల చర్చకు వస్తున్నాయి. […]

Yelahanka Palace: బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వ్యవహారం వైఎస్ కుటుంబంలో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తికి సంబంధించిన వివాదం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్యాలెస్ కు సంబంధించిన సుమారు 22 ఎకరాలభూమి వైఎస్ భారతి పేర్లపై రిజిస్ట్రేషన్ కావడం ఇప్పుడు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ ఆస్తి సుగుణమ్మ పేరుపై ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది? అప్పటి పరిస్థితులు ఏమిటి? అనే అంశాల చర్చకు వస్తున్నాయి.

2006 నాటి సంస్కరణల చట్టమే కారణమా

ఈ భూముల కొనుగోలు జరిగిన 2006 సమయంలో కర్ణాటకలో భూ సంస్కరణల చట్టంలో అమల్లో ఉంది. అప్పటి నిబంధనల ప్రకారం వ్యవసాయకుటుంబ నేపథ్యం లేనివారు, నిర్దిష్ట ఆదాయ పరిమితికి మించిన నేపథ్యంలో సుగుణమ్మ పేరుతో భూముల రిజిస్ట్రేషన్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన వియ్యపురాలు సుగుణమ్మ పేరుతో ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించారనే ప్రచారం కూడా ఉంది.అయితే ఈ వ్యవహారానికి సంబంధించి యాజమాన్య హక్కులు, కొనుగోలు వెనుక ఉన్న ఆర్థిక లావాదేవాల వివరాలు కీలకంగా మారాయి. సుగుణమ్మ వార్త డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పులివెందుల ప్రాంతంలో రూపాయి డాక్టర్ గా గుర్తింపు పొందారు. సామాన్యులకు అందుబాటులో వైద్య సేవలు అందించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో బెంగుళూరులో 22 ఎకరాలు విలువైన భూములను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత సుగుణమ్మ కుటుంబానికి ఉందా? అనే ప్రశ్నలకు కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ భూములు సుగుణమ్మ పేరుతో ఉన్నప్పటికీ, వాటి వెనకాల వైఎస్ కుటుంబం కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల వారి ఆరోపణలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

సిలికాన్ బిల్డర్స్ కు 20 సంవత్సరాల లీజు

ఈ వివరణలో మరో కీలక అంశం సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినది. 2006లో భూముల కొనుగోలు జరిగిన అనంతరం, 2007 మార్చి ఒకటిన సుగుణమ్మ ఆ ఆస్తిని వైఎస్ కుటుంబానికి చెందినదని పేర్కొంటున్న సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 20 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చినట్టు కోర్టు పత్రాల్లో ప్రస్తావన ఉంది. ఈరోజు ఒప్పందం ప్రస్తుతం యలహంక ప్యాలెస్ వివాదంలో కీలకంగా మారింది.

షర్మిల వాదన ఎలా ఉందంటే

మరోవైపు వైయస్ షర్మిల ఈ ప్యాలెస్ పై తన హక్కును బలంగా వినిపిస్తున్నారు. యలహంక ప్యాలెస్ ను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని.. అది తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తి అని ఆమె చెబుతున్నారు. 2019లో పొదిలిన అవగాహన ఒప్పందం ప్రకారం ఈ ఆస్తి తనకు చెబుతుందని ఆమె వాదిస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ పత్రాల్లో సుగుణమ్మ, భారతి పేర్లు ఉండడం, సిలికాన్ బిల్డర్స్ కు ఉన్న లీజు హక్కుల ఆధారంగా దేవనహళ్లి కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు రావడం మరింత క్లిష్టంగా మారింది. ఇంతవరకు ఈ నేపథ్యంలో ప్యాలెస్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. యలహంక ప్యాలెస్ కు సంబంధించి అసలు యాజమాన్యాకలు ఎవరికి చిన్నదాయని అంశం ఇప్పుడు న్యాయపరమైన వివాదంగా మారింది. రిజిస్ట్రేషన్ పత్రాలు.. లీజు ఒప్పందం.. 2019 నాటి అవగాహన ఒప్పందం ఈ వ్యవహారంలో కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper