Homeక్రీడలుAustralia cricket team : టీమిండియా గెలవగానే సూర్యకుమార్ యాదవ్ చేసిన పని.. ఆస్ట్రేలియన్లు సిగ్గుతో...

Australia cricket team : టీమిండియా గెలవగానే సూర్యకుమార్ యాదవ్ చేసిన పని.. ఆస్ట్రేలియన్లు సిగ్గుతో తలదించుకోండి రా

Australia cricket team : కాళ్లకు రక్షణ కల్పించాయి కదా అని చెప్పులను ఇంట్లోకి వేసుకురాలేం. గుమ్మం అవతల వదిలిపెడతాం. అలాగే భూమి గర్భం నుంచి తీసారు కదా అని బంగారాన్ని బయట వదిలేయలేం. దానిని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అవసరమైతే లాకర్లలో భద్రపరచుకుంటాం. కాళ్లకు వేసుకునే చెప్పులు మనకు రక్షణ కల్పిస్తాయి. మెడ మీద ఉండే బంగారం అలంకారాన్ని అందిస్తుంది. రక్షణను.. అలంకారాన్ని ఒకే గాటిన కట్టలేం. కానీ ఈ విషయం ఆస్ట్రేలియా క్రికెటర్లకు తెలియదు. క్రికెట్ […]

Australia cricket team : కాళ్లకు రక్షణ కల్పించాయి కదా అని చెప్పులను ఇంట్లోకి వేసుకురాలేం. గుమ్మం అవతల వదిలిపెడతాం. అలాగే భూమి గర్భం నుంచి తీసారు కదా అని బంగారాన్ని బయట వదిలేయలేం. దానిని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అవసరమైతే లాకర్లలో భద్రపరచుకుంటాం. కాళ్లకు వేసుకునే చెప్పులు మనకు రక్షణ కల్పిస్తాయి. మెడ మీద ఉండే బంగారం అలంకారాన్ని అందిస్తుంది. రక్షణను.. అలంకారాన్ని ఒకే గాటిన కట్టలేం. కానీ ఈ విషయం ఆస్ట్రేలియా క్రికెటర్లకు తెలియదు. క్రికెట్ మీద ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్లు సంవత్సరాలుగా పెత్తనం సాగిస్తున్నారు.

ఎన్నడు కూడా సాధించిన ట్రోఫీలకు.. పొందిన విజయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు ఆస్ట్రేలియా క్రికెటర్లు. అందువల్లే 2023 వన్డే వరల్డ్ కప్, అదే ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ తర్వాత.. ఇంతవరకు ఆస్ట్రేలియా జట్టు ఐసిసి మేజర్ టోర్నీలో ఆస్ట్రేలియా ట్రోఫీని అందుకోలేకపోయింది. 2024 t20 వరల్డ్ కప్, 2025లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ, 2026 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. తద్వారా ఆస్ట్రేలియా పెత్తనాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు క్రికెట్లో ఎలా వ్యవహరించాలి? ట్రోఫీ సాధించిన తర్వాత ఆటగాళ్లు ఎలా ఉండాలి.. అనే విషయాలను ప్రముఖంగా బోధిస్తోంది.

2023లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు ట్రోఫీ మీద కాళ్ళు పెట్టి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి. చాలామంది ఆస్ట్రేలియా ప్లేయర్లు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పట్టారు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్లు తాము చేసిన పనిని సమర్ధించుకున్నారు. అయితే టీమిండియా 2024లో టి20 వరల్డ్ కప్.. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2026 లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చాలా హుందాగా వ్యవహరించింది. 2026లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత ప్లేయర్లు బీర్లు పొంగించలేదు. షాంపెన్ ను విరజిమ్మలేదు. పైగా ట్రోఫీ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ లోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు. స్వామివారి సన్నిధిలో ట్రోఫీని పెట్టారు. హనుమంతుడి ఆశీస్సులు తీసుకున్నారు. గుడికి వెళ్ళిన సమయంలో టీమిండియా ప్లేయర్లు మాత్రమే కాదు.. టీమిండియా కోచ్.. ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper