
డ్వాక్రా వెలుగు గ్రూపులో అశ్లీల దృశ్యాలు కలకలం రేపాయి. కృష్ణా జిల్లాలోని చాట్రాయి వెలుగు గ్రూప్ లో ఏపియం బాలసుబ్రమణ్యం అశ్లీల వీడియోలను పోస్ట్ చేశాడు. దాంతో గ్రూప్ లో ఉన్న సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గ్రూప్ లో అందరూ మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీయం కావడంతో బాలసుబ్రమణ్యం ఆ గ్రూపులో ఉన్నారు. కాగా మహిళల గ్రూప్ లో నీలి వీడియో పంపడంపై మహిళా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.