Godavari Pulasa fish: మనలో ఎంత ప్రతిభ ఉన్నా.. ఆవకాయ అంత అదృష్టం ఉండాలి అంటారు. అయితే అదృష్టం కొందరికే దక్కుతుంది. కానీ ఆ మత్స్యకార యువకుడికి ఏటా అదృష్టం పలకరిస్తూనే ఉంది. యానాం రాజీవ్ బీచ్ లో( Yanam Rajiv beach) ఓ మత్స్యకార యువకుడి వలకు పులస చేప చిక్కింది. కేజీ 800 గ్రాములు ఉండే ఆ చేప ఏకంగా 22 వేల రూపాయల ధర పలికింది. అయితే ఈ పులస చేప దక్కించుకునేందుకు ఎందరో పోటీపడ్డారు. చివరకు పొన్నమండ రత్నం అనే మహిళ వేలంలో చేపను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా ఓ చిన్నపాటి చేప 22 వేల రూపాయల ధర దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయం.
Also Read: మిథున్ రెడ్డి అరెస్ట్.. అంతా సైలెన్స్!
గత ఏడాది కూడా..
మల్లాడి ప్రసాద్( Malladi Prasad ) అనే మత్స్యకార యువకుడు గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లాడు. గౌతమి గోదావరి నదిలో భైరవ పాలెం సమీపంలో ప్రసాద్ వేసిన వలకు చిక్కింది ఈ చేప. అయితే ఇలా పులస చేప వలలో పడడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది కూడా ప్రసాద్ వేసిన వలకు పులస చేప చిక్కింది. అప్పట్లో దాని ధర 23 వేల రూపాయల వరకు పలికింది. ఆ ఏడాదికి అదే ధర రికార్డ్. అయితే ఈసారి ప్రసాద్ వలలో చిక్కిన చేప 22 వేల రూపాయలు పలకడం విశేషం.
Also Read: అల్పపీడనం…విజయవాడకు ఎల్లో అలెర్ట్..
అరుదైన చేప..
పులస(Pulasa) అనేది ఓ అరుదైన చేప. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్. ప్రస్తుతం వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పులస చేపలు సంతానోత్పత్తి కోసం బంగాళాఖాతం నుంచి నదిలోకి వస్తున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మాత్రమే పులస చేపలు లభిస్తాయి. ఈ ఏడాది తొలి పులస చేప యానం వద్ద గౌతమి గోదావరి లో జాలర్లకు చిక్కింది. అయితే పెద్ద ఎత్తున పులస చేపలు చిక్కుతుండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్ని చేపలు చిక్కిన రాని డబ్బులు.. ఒక్క పులస చిక్కితే చాలు వస్తాయి. అందుకే ఎక్కువగా మత్స్యకారులు పులస చేపల కోసం వేట సాగిస్తున్నారు.