Telugu Matrimony Websites: నేటి వేగవంతమైన జీవితంలో, అన్ని కోరికలు ఆన్‌లైన్‌లో నెరవేరుతాయి. కూరగాయలు, బ్యూటీ పార్లర్, యోగా టీచర్ నుంచి ఆన్‌లైన్ డేటింగ్, ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ వరకు ప్రతీది ఆన్ లైన్ లోనే లభిస్తాయి. ప్రతీది కేవలం ఒక క్లిక్ దూరంలో మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వరుడు లేదా వధువు కోసం వెతుకుతున్న రోజులు ఇప్పుడు పోయాయి. ఇప్పుడు చాలా మంది మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లను విశ్వసించడం ప్రారంభించారు. కానీ భాగస్వామిని కనుగొనడం గురించి మాట్లాడే ఆన్‌లైన్ సైట్‌లతో అతిపెద్ద సమస్య ఏమిటంటే, ముందు ఉన్న వ్యక్తి సరైనవాడా లేదా అనేది తెలీదు కదా.
మీ పెళ్లి ఎప్పుడు.. వయసు దాటిపోతోంది… మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు. ఇలాంటి మాటలతో మీరు కూడా పెళ్లి, పెళ్లి, పెళ్లి అని విని విసిగిపోయారా..? మీకు మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్ ఉందా? ప్రొఫైల్ చేసుకోవాలి అనుకునేటప్పుడు, మీరు UPI కోసం ఉపయోగించే ఇమెయిల్ ID విషయంలో జాగ్రత్త. చాలా అప్రమత్తంగా ఉండాలి. దేశవ్యాప్తంగా వేలాది మంది మ్యాట్రిమోనియల్ సైట్‌లలో మోసాలు కూడా చేస్తున్నారు. తప్పుడు రిలేషన్ లు పెట్టుకొని అనవసరమైన వాగ్దానాలు చేస్తూ భావోద్వేగాలతో ఆడుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది.
పెళ్లి చేసుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అనేవారు. కానీ ఇప్పుడు జస్ట్ ఒక క్లిక్ ద్వారా వరుడు/వధువును ఎంచుకుంటున్నారు. కానీ ఇది అందరి విషయంలో కరెక్ట్ కాదు. కొందరు మోసాలు చేస్తుంటే మరికొందరు మంచి ప్రవర్తనతో ఉంటున్నారు. సో ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎవరితో మాట్లాడేటప్పుడు అయినా సరే నమ్మకం ముఖ్యం. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం మరింత అవసరం. మీ సేఫ్టీ కోసం కొత్త మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోండి.
వారి ప్రొఫైలో నిజంగా వాస్తవం ఉందా? వారు నిజంగా చెప్పిన సంస్థలో పని చేస్తున్నారా? వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? నేర చరిత్ర ఉందా? వారు చెప్పిన అడ్రస్ నిజమేనా? ఇలా చాలా విషయాలను మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. వారి గురించి ఎలాంటి నెగిటివ్ ను వారు అంగీకరించరు. చెప్పరు. సో జాగ్రత్త పడాల్సింది మీరే. వీలైనంత ఎక్కువ సమాచారం మీ వద్ద ఉండాలి. పెళ్లి ఫిక్స్ అయినా తర్వాతనే మీరు ఫోటోలను పంపండి. ఆర్థిక లావాదేవీలు కూడా అసలు చేయవద్దు.
ఒకరి ప్రొఫైల్ మరొకరికి ఒకే అనిపించినా లేదా కలవాలి అనుకున్నా సరే ముందుగా మీ ఇంట్లో వాళ్లకు చెప్పండి. వారి గురించి తెలుసుకొని ఆ తర్వాత కలవడానికి వెళ్లండి. ఏమో వారు ఎలాంటి వారో..మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారామో? మీ నుంచి వాళ్లు ఏదైనా ఆశిస్తున్నారేమో. అందుకే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం అంటున్నారు నిపుణులు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.