Modi Special Gift AP: ఏపీవ్యాప్తంగా విద్యుత్ వాహన వినియోగదారుల( electric vehicle consumers) సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ, కాలుష్యం లేకపోవడం వంటి కారణాలతో ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే ఖర్చు తక్కువగా ఉండడం, ప్రభుత్వం లైఫ్ టాక్స్ పూర్తిగా మినహాయింపు ఇస్తుండడం వంటి కారణాలతో అటువైపుగా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఎంతగానో ప్రోత్సహిస్తుంది. దాదాపు 700 కు పైగా ఏపీఎస్ఆర్టీసీకి బస్సులను ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే ఇప్పుడు దాదాపు అన్ని నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కు సంబంధించి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు కొనుగోలు సంఖ్య పెరుగుతుందని ఆశిస్తోంది.
Also Read: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు!
* గణనీయంగా పెరిగిన వినియోగం
గతంతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. 2019 నుంచి 2020 మధ్య రాష్ట్రంలో విద్యుత్ ద్విచక్ర వాహనాల సంఖ్య 10 42 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు లక్షలాదిగా వాహనాలు అమ్ముడవుతున్నాయి. చివరకు విద్యుత్ కార్ల( electric cars) సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే కేవలం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెంచడమే కాదు.. వాటికి సంబంధించి చార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. వాటి ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రైవేటు ఏజెన్సీలను సైతం రాయితీలు ఇచ్చి ఏర్పాటు చేసేలా చూస్తోంది. గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గంలో పరిమితంగా మాత్రమే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఆ మార్గంలో చాలా చోట్ల చార్జింగ్ స్టేషన్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక్క విజయవాడ నగర పరిధిలోనే దాదాపు 20 ఛార్జింగ్ స్టేషన్లో ఉన్నాయి. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా అన్ని రకాల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు కలిపి 880 ఉన్నట్లు విద్యుత్ శాఖ కణాంకాలు చెబుతున్నాయి.
* 2030 నాటికి ఐదు వేలు
ఏపీవ్యాప్తంగా 2030 నాటికి 5వేలకు పైగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్( public charging station) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నగరాలు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటిని అందుబాటులోకి తేవాలని భావిస్తాంది కేంద్ర ప్రభుత్వం. చార్జింగ్ స్టేషన్లో ఏర్పాటుకు సంబంధించి ఏపీ నెడ్ క్యాప్ పర్యవేక్షిస్తోంది. రోజురోజుకు రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 950 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల పరిధిలో సైతం వీటిని అందుబాటులోకి తేవాలని చూస్తోంది. తద్వారా త్వరలో రాష్ట్రానికి కేటాయించి 700 ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ ఇబ్బందులు లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది. మొత్తానికైతే ఎలక్ట్రిక్ వాహనాలకు మోడీ ప్రభుత్వం బాగానే ప్రోత్సహిస్తోంది.