spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP MLAs: ఆ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. ఎంజాయ్ చేసిన వైసిపి ఎమ్మెల్యేలు

YCP MLAs: ఆ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. ఎంజాయ్ చేసిన వైసిపి ఎమ్మెల్యేలు

YCP MLAs: ఏపీలో అధికార వైసీపీ నేతల ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది. వారిదే రాజ్యం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. వారింట్లో ఫంక్షన్లు, పుట్టినరోజు వేడుకలు,శుభకార్యాలు జరిగితే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. రోడ్లను బ్లాక్ చేసి విందులు, వినోదాలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. జనాలకు మాత్రం తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండి అని హెచ్చరిస్తున్నారు.

ప్రకాశం జిల్లా దర్శి లో బుధవారం రాత్రి స్థానికులు పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. పట్టణంలోని ఓ ప్రధాన మార్గాన్ని మూసివేసి వైసీపీ నేతలు తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. 12 మంది యువతులతో రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కూడా వారితో రెచ్చిపోయి డ్యాన్సులు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వేదికపై ఏకంగా ఎమ్మెల్యే వేణుగోపాల్ తో పాటు సోదరుడు శ్రీధర్ ఉండడం విమర్శలకు తావిచ్చింది. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు బాపట్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సూర్యలంక రోడ్డు లోని కాకుమాను వారి పాలెం వద్ద నడిరోడ్డుపై యువతులు డ్యాన్సులతో హోరెత్తించారు. ఎమ్మెల్యే రఘుపతి పుట్టినరోజు సందర్భంగా ప్రధాన కూడలిలో శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వేదిక ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అటు అశ్లీల నృత్యాలు కనిపిస్తున్నా పోలీసులు నియంత్రించలేని పరిస్థితి. పది రోజుల క్రితం ఎమ్మెల్యే సోదరుడు పుట్టినరోజు వేడుకల్లో కూడా ఇదేవిధంగా గలాటా చేశారు. దీంతో బాపట్ల ప్రజలు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Pawan Kalyan And Allu Arjun

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...
Spirit Movie

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...
Chiranjeevi And Pawan Kalyan

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper