Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ విడాకులు.. టిడిపి.. వైసిపి కీలక నిర్ణయం.. జనసైనికులు ఇది ఊహించలేదు..

Pawan Kalyan: పవన్ విడాకులు.. టిడిపి.. వైసిపి కీలక నిర్ణయం.. జనసైనికులు ఇది ఊహించలేదు..

Pawan Kalyan: రాజకీయ ఘర్షణలు.. పరస్పర విమర్శలు.. కుట్రల ఆరోపణలు.. నేతల వ్యక్తిగత జీవితాల పై వ్యాఖ్యలు.. ఇవన్నీ చూసి విసిగిపోయిన ఏపీ ప్రజలకు ఒక మంచి పరిణామం కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల వ్యవహారంపై రాజకీయ విమర్శలు చేయకూడదని తెలుగుదేశం పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తమ కార్యకర్తలకు సూచించడం చర్చకు దారితీస్తోంది. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన ఏ చిన్న పరిణామం జరిగినా.. దానిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి […]

Pawan Kalyan: రాజకీయ ఘర్షణలు.. పరస్పర విమర్శలు.. కుట్రల ఆరోపణలు.. నేతల వ్యక్తిగత జీవితాల పై వ్యాఖ్యలు.. ఇవన్నీ చూసి విసిగిపోయిన ఏపీ ప్రజలకు ఒక మంచి పరిణామం కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల వ్యవహారంపై రాజకీయ విమర్శలు చేయకూడదని తెలుగుదేశం పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తమ కార్యకర్తలకు సూచించడం చర్చకు దారితీస్తోంది.

సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన ఏ చిన్న పరిణామం జరిగినా.. దానిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు.. అభిమానులు హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటాం. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సందేశం రావడం మంచి పరిణామం లాగా విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ, ఐ టీడీపీ కీలక ప్రకటన

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని టిడిపి అనుబంధ ఐ టిడిపి విభాగం స్పష్టం చేసింది. కూటమి పార్టీల నేతలైనా.. ప్రతిపక్ష నాయకులైనా వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి పోస్టులు.. చర్చలను ప్రోత్సహించేది లేదని హెచ్చరించింది. ఐ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలనుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వైసిపి కూడా అదే బాటలో..

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ నాయకులు.. కార్యకర్తలు.. అధికార ప్రతినిధులు.. సోషల్ మీడియా విభాగానికి కీలక సూచనలు చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని కోరింది. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులపై చర్చలు చేయడం.. ఇతరులు పెట్టిన పోస్టులకు స్పందించడం.. సంబంధిత ఫోటోలు.. వీడియోలు షేర్ చేయడం వంటివి చేయకూడదని సూచించింది. వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని.. బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు సమయమనం పాటించాలని వైసిపి కేంద్ర కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

కొత్త సంప్రదాయానికి నాంది

వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో టిడిపి.. వైసిపి మధ్య విమర్శలు కొత్త కాదు. గత ఎన్నికల ప్రచారాల్లో.. సోషల్ మీడియాలో నేతల వ్యక్తిగత జీవితాలు రాజకీయ చర్చల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం పై గతంలోనూ రాజకీయ విమర్శలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు తమ శ్రేణులకు సమయమనం పాటించాలని సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను విమర్శలకు ఆయుధంగా మార్చుకోకూడదని సందేశం ఇందులో కనిపిస్తోంది.

రాజకీయాల్లో అభిప్రాయ బేధాలు ఉండవచ్చు. పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయవచ్చు. కానీ ఒక నాయకుడి కుటుంబ జీవితం.. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ విమర్శల్లోకి లాగడం మాత్రం ఆరోగ్యకరమైన సంప్రదాయం కాదని విశ్లేషకులు అంటున్నారు.

టిడిపి.. వైసిపి తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ విశ్లేషకులు మంచి పరిణామం లాగా భావిస్తున్నారు. ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా అభివృద్ధి.. సంక్షేమం.. పరిపాలన.. ప్రజా సమస్యల మీద రాజకీయ పార్టీలు గిఫ్ట్ సారిస్తే రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత మెరుగుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఇలాంటి కనీస గౌరవం.. సమయమనం కొనసాగితే ప్రజాస్వామ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఈ విషయంలో టిడిపి.. వైసిపి మొదలు పెట్టిన సంప్రదాయం ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా నిలవాలని విశ్లేషకులు కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper