Jagan Mohan Reddy: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్.. మైనింగ్ అక్రమాల ద్వారా 50వేల కోట్లు సంపాదించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇంత నగదును కరెన్సీ రూపం లో భద్రపరిచారని టిడిపి నేతలు చెబుతున్నారు.. ఈ స్థాయిలో నగదు జగన్ దాయడానికి ప్రధాన కారణం లిక్కర్.. మైనింగ్ లో అక్రమాలే కారణమని టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే ఈ అక్రమమైన కరెన్సీని మొత్తం నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అందువల్లే ఆయన పెద్ద నోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
500 నోట్ల వినియోగం వల్ల అక్రమ మార్గంలో నల్ల డబ్బులు దాచుకోవడం.. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రోలోబపెట్టడానికి ఉపయోగిస్తున్నారని టిడిపి నేతలు అంటున్నారు. డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా మారిన ఈ రోజుల్లో పెద్ద నోట్లు అవసరం లేదని.. అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే 500 నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు తెరమీదకి సరికొత్త డిమాండ్ తీసుకువచ్చారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రంలో మద్యం విక్రయాలు మొత్తం నగదు రూపంలో జరిగాయి. గనులు.. ఇసుక ఉచితాల పేరుతో వేలకోట నగదు పోగు పడింది. దీని వెనక పెద్ద ప్రణాళిక ఉందని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు చెప్పినట్టుగా కేంద్రం 500 నోట్లను రద్దుచేస్తే.. జగన్ దాచిన 50,000 కోట్లు చిత్తు కాగితాలుగా మారుతాయి అని టిడిపి నేతలు అంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు పెద్ద నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్ ను ఆయన లేవనెత్తారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా అవినీతి పూర్తిగా తగ్గిపోతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఆన్లైన్ విధానంలో.. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట పడుతుందని.. పెద్ద నోటను రద్దు చేస్తే పారదర్శకత పెరుగుతుందని చంద్రబాబు అంటున్నారు. దీనివల్ల రాజకీయ అవినీతి కూడా తగ్గిపోతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ ఉద్యమం వల్ల జగన్ దాచుకున్న యాభై వేల కోట్లు చిత్తు కాగితాలుగా మారిపోతాయని.. విశ్లేషకులు అంటున్నారు.
జగన్ ఈ స్థాయిలో నగదు అక్రమంగా దాచారు కాబట్టే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, అధికారంలోకి వస్తామని చెబుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ చేసిన అరాచకాలు తారాస్థాయిని దాటిపోయాయని, అలాంటివ్యక్తి అక్రమంగా దాచిన డబ్బుతోనే అధికారంలోకి రావాలనుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.,