spot_img
Homeఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్రం స్పందించేనా?

అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్రం స్పందించేనా?

telugu states assembly seatsతెలుగు స్టేట్లలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశంపై ఎన్నోమార్లు డిమాండ్లు వస్తున్నాయి. రాష్ర్ట విభజన తరువాత నుంచి కూడా అసెంబ్లీ సీట్ల విషయం పలుమార్లు చర్చకు వచ్చింది. అయినా కార్యరూపం దాల్చడం లేదు. జమ్ము కాశ్మీర్ లో కేంద్ర పాలన ఎత్తివేసి రాష్ర్ట హోదా ఇచ్చింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. తెలుగు స్టేట్లలోనూ విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయం ఉంటుందని భావించినా అమలు కావడం లేదు.

2014లో పార్లమెంట్ లో ఆమోదించిన విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225 గా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 134 గా పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఎన్డీఏ తొలి దశలో విభజన హామీల అమల్లో భాగంగా పలుమార్లు న్యాయశాఖతో చర్చలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం సాధ్యం కాదని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ అవసరమని న్యాయశాఖ అప్పట్లోనే వివరణ ఇచ్చింది.

రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అది 2026 తరువాత జరిగే జనాభా లెక్కల అనంతరమే సాధ్యమవుతుందని తెలుస్తోంది. ఈరోజు లోక్ సభలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. 2031 జనాభా లెక్కల తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమవుతుందని చెప్పారు.

2024, 2029 ఎన్నికల నాటికి రెండు స్టేట్లలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పార్లమెంట్ స్థానాల్లో రెండు స్టేట్లకు సభ్యుల సంఖ్య బాగానే ఉంది. దీంతో ఇరు ప్రాంతాలు సీట్లపై కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఫలితం ఉంటుందని భావించినా ఫలితం దక్కదని తెలుస్తోంది. 2031 వరకు సీట్ల పెంపుపై ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper