Harish Rao Black Magic Allegations : తెలంగాణ రాజకీయాలు తాంత్రిక పూజలు చుట్టూ తిరుగుతున్నాయి. చేతబడులు లేవని.. మూఢనమ్మకాలను నమ్మకూడదని.. శాస్త్ర సాంకేతిక రంగాలలో వేగంగా పరుగులు పెడుతున్న కాలంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేదని ఓవైపు శాస్త్రవేత్తలు చెబుతుంటే.. మూఢనమ్మకాలను.. తాంత్రిక పూజలను.. చేతబడులు ఉన్నాయని రాజకీయ నాయకులు చెప్పడం నిజంగా సరికొత్త చర్చకు దారి తీస్తోంది .
భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడు హరీష్ రావు చేతబడి చేశారని.. ఆయన ఇటీవల తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాలలో ఉన్న గుడులకు వెళ్లారని.. అక్కడి అఘోరాలతో పూజలు జరిపించుకున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలు చేయడానికి కంటే ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. సామా రామ్మోహన్ రెడ్డి హరీష్ రావు మీద చేతబడి ఆరోపణలు చేశారు. ఆయన వివిధ రాష్ట్రాల్లో గుడులకు వెళ్లి.. కొంతమంది తాంత్రిక పూజారులతో చేతబడులు చేశారని.. రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం కూలిపోవాలి అన్నట్టుగా ఆయన ఈ పూజలు జరిపించారని వారు ఆరోపించారు.
రామ్మోహన్ రెడ్డి.. మహేష్ కుమార్ గౌడ్ తర్వాత రేవంత్ రెడ్డి రంగంలోకి వచ్చారు. ఈసారి ఏకంగా ఆయన లోతుల్లోకి వెళ్లి విమర్శలు చేశారు..”నువ్వు బాత్రూం వెళ్లినా.. చెట్టు కింద ఉన్నా.. పుట్ట కింద ఉన్నా.. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటావు కదా. వీడియో తీసి హంగామా చేస్తుంటావు కదా. మరి నువ్వు శివమొగ్గ ఎందుకు వెళ్లినవ్.. అక్కడి ఫోటోలు ఎందుకు సోషల్ మీడియాలో పెట్టలేదు.. అక్కడ ఏం పూజలు జరిపించినవ్ .. నేను శ్రీశైలం నుంచి యాదగిరిగుట్ట వరకు ఎక్కడికి వెళ్లినా సరే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడతా. దర్శనానంతరం విలేకరులతో మాట్లాడతా. తెలంగాణ బాగుండాలని కోరినట్టు చెబుతుంటారు. మరి నువ్వు కర్ణాటక ఎందుకు వెళ్లినవ్.. ఎవరిని కలిసినవ్.. ఏం పూజలు చేసినవ్. . ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు కూడా స్పందించారు.. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. చేతబడి చేయాల్సిన అవసరం తనకు లేదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని.. ముందు వాళ్లకు సమాధానం చెప్పాలని హరీష్ రావు సవాల్ విసిరారు. రైతుబంధు.. రైతు రుణాల మాఫీకి సంబంధించి సీఎం సొంత ఊరికి తాను వెళతానని.. అక్కడ నూటికి నూరు శాతం రుణమాఫీ జరిగినట్టు తేలితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ అలా జరగకపోతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ విసిరారు.
హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
శివమొగ్గ గుడిలో పూజలు చేస్తే కనీసం ఫోటోలు కూడా ఎందుకు పెట్టలే. రహస్యంగా ఎందుకు ఉంచినట్లు?#RevanthReddy #HarishRao #TelanganaPolitics #Shivamogga #PoliticalDebate pic.twitter.com/j4TrU4K46h
— Telugu360 (@Telugu360) August 15, 2026