Homeఆంధ్రప్రదేశ్‌Alluri Sitharamaraju District : 'రాను ముంబాయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు!

Alluri Sitharamaraju District : ‘రాను ముంబాయికి రాను’.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు!

Alluri Sitharamaraju District : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ తరుణంలో కొన్నిచోట్ల వింత పరిస్థితులు, అపశృతులు చోటుచేసుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీశాఖ సిబ్బంది సినిమా పాటలకు, జానపదాలకు డాన్సులు వేయడం సోషల్ మీడియాలో వెలుగు చూసింది. విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. నెటిజన్లు తలో రకం స్పందిస్తున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు […]

Alluri Sitharamaraju District : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ తరుణంలో కొన్నిచోట్ల వింత పరిస్థితులు, అపశృతులు చోటుచేసుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీశాఖ సిబ్బంది సినిమా పాటలకు, జానపదాలకు డాన్సులు వేయడం సోషల్ మీడియాలో వెలుగు చూసింది. విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. నెటిజన్లు తలో రకం స్పందిస్తున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పుపడుతున్న వారు ఉన్నారు. తప్పేముందని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.

* అల్లూరి జిల్లాలో..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. జెండా ఆవిష్కరణ అనంతరం.. స్వాతంత్ర విశిష్టతను తెలిపారు. అయితే తర్వాత సిబ్బంది డాన్సుల్లో మునిగిపోయారు. జాతీయ గీతాలతో పాటు దేశభక్తి గీతాలు స్థానంలో.. ‘రాను బొంబాయి కి రాను’ అనే పాటతో సిబ్బంది డాన్సులతో హోరెత్తించారు. మహిళలతో పాటు పురుషులు జతకట్టడం కనిపించింది. అయితే ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అటు ప్రధాన మీడియాలో సైతం కథనాలు మొదలయ్యాయి. అయితే దీనిపై భిన్న స్పందన వస్తోంది. అందులో తప్పేముందని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటేనే సంబరాల వేడుకని గుర్తు చేస్తున్నారు. అనవసరంగా వివాదం చేయవద్దని కూడా కోరుతున్నారు.

* గతంలో సైతం…
అయితే గతంలో కూడా మన్యం జిల్లాలో ఇటువంటి వివాదాలు వెలుగులోకి వచ్చాయి. ఓ పాఠశాల వేడుకల్లో విద్యార్థులతో జానపదాలకు డాన్స్ చేయించినట్లు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. చాలా వివాదాస్పదం అయింది. ఇప్పుడు మరోసారి అటువంటి ఘటనే చోటు చేసుకోవడం విశేషం. చాలామంది వివాదాస్పదం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయినా సరే అధికారులు జాగ్రత్త పడడం లేదు. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయిన తర్వాత.. ఆటవిడుపుగా డాన్సులు చేశారే తప్ప.. జాతీయ గీతాలు, భక్తి గీతాలు స్థానంలో చేయలేదని.. కార్యక్రమం ముగిసిన తర్వాత మాత్రమే సిబ్బంది ఇలా సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఇటువంటివి జరుపుకునే సమయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నది ఈ ఘటన ద్వారా తెలియజేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Open Vaartha (@openvaartha)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper