
#JSP 10th Formation Day : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మచిలీపట్నం లో భారీ బహిరంగ సభ ని ఏర్పాటు చేసాడు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఈ సభకి జనాలు తండపతంధాలుగా తరళి వచ్చారు..మంగళగిరి పార్టీ ఆఫీసు నుండి ‘వారాహి’ వాహనం మీద మచిలీపట్నం కి బయలుదేరిన పవన్ కళ్యాణ్ సాయంత్రం ఆరు గంటలకు సమయానికి సభా స్థలికి చేరుకోవాల్సి ఉండగా, అభిమానుల తాకిడి కారణం గా 8 గంటల పైనే సభకి చేరుకునే అవకాశం ఉందని లేటెస్ట్ అందుతున్న సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు భారీ ర్యాలీతో సభకి చేరుకోవాలని ఘానంగా ప్లాన్ చేసారు. దీనిని వైసీపీ ప్రభుత్వం తన దగ్గరున్న పోలీస్ యంత్రాంగం ని వాడి ఈ ర్యాలీ ని ఆపాలనే ప్రయత్నం చేసారు.
కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు పోలీసుల నోటీసులను ఏమాత్రం లెక్క చెయ్యకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు 10,000 బైక్స్ తో మంగళగిరి నుండి మచిలీపట్నం కి బయలుదేరారు. అడుగడుగునా జనాలు ఆయనకీ పలికిన నీరాజనం చూస్తూ ఉంటే వారాహి టూర్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం అన్ని అర్థం అయిపోయింది. ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టడం ప్రారంభం అయ్యింది. ఆయనకీ ఏ స్థాయిలో జనాలు నీరాజనం పలికారో మీరే చూడండి.