Black Magic Politics: సాంకేతిక యుగంలో మనిషి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు దాటిపోయింది. టెక్నాలజీని ఉపయోగించుకొని తన జీవితాన్ని మరింత సుఖవంతం చేసుకోవడం పెరిగిపోయింది. ప్రతిది కూడా తన అదుపులో ఉండేలాగా మనిషి చూసుకుంటున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ అనుకూలంగా మారిపోతుంది. నిన్న ఏం జరిగింది.. నేడు ఏం జరుగుతోంది.. రేపు ఏం జరగబోతోంది ఇలా అనేక విషయాలను మనిషి అత్యంత సులువుగా.. సులభంగా తెలుసుకుంటున్నాడు. ఇటువంటి కాలంలో క్షుద్ర పూజలకు అవకాశం ఉంటుందా.. తాంత్రిక విద్యల వల్ల మనిషి అనుకున్నది సాధించగలుగుతాడా.. అసలు క్షుద్ర పూజల వల్ల ఏం జరుగుతుంది.. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే.. తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి.
ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు తన కుటుంబంతో సహా తీర్థయాత్రలకు వెళ్లారు. ఆయనకు దైవభక్తి అధికంగా ఉంటుంది. పైగా ఆయన వెళ్ళింది ఇతర రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాలను సందర్శించుకోవడానికి. హరీష్ రావు తీర్థయాత్రల వ్యవహారంలో మరో కోణాన్ని చూశారు కాంగ్రెస్ నాయకులు. ఆయన క్షుద్ర పూజలు చేయడానికి ఆ క్షేత్రాలను సందర్శించారని వారు విమర్శిస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి.. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వంటి వారు ఈ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.
హరీష్ రావు ఉద్యమ నాయకుడు. రామ్మోహన్ రెడ్డి యువ నాయకుడు.. మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ పొలిటిషన్. వాస్తవానికి హరీష్ రావు మీద ఈ స్థాయిలో రామ్మోహన్ రెడ్డి.. మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేస్తారని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించలేదు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు.. సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టు ఉన్నవాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడటం నిజంగా ఆశ్చర్యకరం. ఒకవేళ అటువంటి వాటి వల్ల అనుకున్నవన్నీ జరుగుతాయి అనుకుంటే. ఇదంతా ఎందుకు.. శాస్త్రవేత్తల మేథో మదనం ఎందుకు.. ఆవిష్కరణల కోసం ఈ స్థాయిలో తాపత్రయ పడటం ఎందుకు.. ఇదంతా జనాలను పిచ్చోలను చేసే పని తప్ప మరోటి కాదు. అసలు విషయాలను పక్కనపెట్టి డైవర్ట్ రాజకీయాల కోసం నేతలు ఇలాంటి పనులు చేస్తుంటారని విశ్లేషకులు అంటున్నారు.
మనదేశంలో అస్సాం రాష్ట్రంలో క్షుద్ర పూజలు ఎక్కువగా జరుగుతుంటాయని.. కామాఖ్య దేవి ఆలయంలో ఈ తరహా పూజలు నిర్వహిస్తుంటారని.. వీటి కోసం ఇతర దేశాలకు చెందిన వారు కూడా వస్తుంటారని సమాచారం. ఈ పూజల వెనుక ఏం జరుగుతుంది.. వారి లక్ష్యాలు ఏంటి అనే విషయాలను పక్కన పెడితే.. క్షుద్ర పూజల వల్ల మనుషులను వశం చేసుకోవడం.. లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదు. ఎందుకంటే వెనుకటి కాలంలో ఇటువంటి వాటి మీద నమ్మకం ఉండేది. కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానాల మీద మనిషికి పట్టు పెరగడం వల్ల అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇటువంటి రోజుల్లో కూడా ఈ మూఢ నమ్మకాల మీద కొంతమంది నమ్మకం పెంచుకోవడం.. వాటిని వ్యాప్తి చెందించడం నిజంగా అవివేకం.
సినిమాలలో చూపించినట్టు.. క్షుద్ర పూజలు.. తాంత్రిక విద్యలు ఉండవు. వాటి ద్వారా ఆ స్థాయిలో అనుకున్నవి జరగవు. కొంతమంది దేవుడు ఉన్నట్టే.. దయ్యాలు కూడా ఉంటాయని చెబుతుంటారు. దేవుడు అనేది నమ్మకం. మనల్ని నడిపించే ఒక విశ్వాసం. దయమనేది ఒక భయం. మనల్ని ఇబ్బంది పెట్టె ఒక బ్రాంతి. అలాంటప్పుడు విశ్వాసాన్ని మాత్రమే నమ్మాలి. నమ్మకాన్ని మాత్రమే అనుసరించాలి. భయాన్ని.. బ్రాంతిని నమ్ముకుంటే ముందడుగు వేయలేం. రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు. నరం లేని నాలుకలాగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటారు. వాటిని నమ్మకూడదు. రాజకీయ నాయకుల మాటలను జస్ట్ ఇలా విని అలా వదిలేయాలి. ఎందుకంటే రాజకీయం కోసం రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు.. తమ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. గతం చెప్పేది అదే. వర్తమానం చెబుతున్నది అదే. భవిష్యత్తు చెప్పబోయేది కూడా అదే.