Homeఎంటర్టైన్మెంట్Korean Kanakaraju First Review: కొరియన్ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ...

Korean Kanakaraju First Review: కొరియన్ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ…

Korean Kanakaraju First Review: బాక్సాఫీస్ వద్ద మెగా ఫ్యామిలీ హవా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇక ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసిన కూడా అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికి రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వీళ్ళ […]

Korean Kanakaraju First Review: బాక్సాఫీస్ వద్ద మెగా ఫ్యామిలీ హవా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇక ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసిన కూడా అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికి రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వీళ్ళ తర్వాత ఇప్పుడు వరుణ్ తేజ్ సైతం ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలైతే వీక్షించారు. ముఖ్యంగా చిరంజీవి కూడా ఈ సినిమాని చూశాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ మూవీని చూసిన ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

కనకరాజు అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఒక కొరియన్ దయ్యం పడుతుంది. ఆ తర్వాత ఆయన ఎలా బిహేవ్ చేశాడు. అసలు అతనికి ఆ దయ్యం ఎందుకు పట్టింది. దాని నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది.

అయితే దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాని మొదటి నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ వే లో తీసుకెళ్లాడు. తద్వారా సినిమాకి ప్రేక్షకులందరు కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని సినిమాని చూసిన వారైతే చెబుతున్నారు. గతంలో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ , ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లాంటి కామెడీ సినిమాలతో సక్సెస్ లను సాధించాడు. కాబట్టి ఇప్పుడు మరోసారి అదే కామెడీ ట్రాక్ ని నమ్ముకొని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు అతనికి సక్సెస్ ని సాధించి పెట్టలేదు. కాబట్టి ఈ సినిమా మీద వరుణ్ తేజ్ స్పెషల్ కేర్ తీసుకున్నాడు.

ఈ సినిమాలో కమెడియన్ సత్య కామెడీ ట్రాక్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందట. మొత్తానికైతే ఈ సినిమాని చూసిన సినిమా పెద్దలు సైతం సినిమా మీద పాజిటివ్ స్పందించారు. తద్వారా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper