Homeబిజినెస్best bricks for house : ఇల్లు బలంగా ఉండాలంటే ఏ ఇటుక వాడాలి? -...

best bricks for house : ఇల్లు బలంగా ఉండాలంటే ఏ ఇటుక వాడాలి? – సిమెంట్, మట్టి, ఫ్లై యాష్ ఇటుకల్లో ఏది బెస్ట్?

best bricks for house :  సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలను సాకారం చేసుకునే సమయంలో సరైన నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా ఇల్లు బలంగా ఉండాలంటే ఇటుకల నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఇల్లు నిర్మాణానికి ఎర్ర ఇటుకలు వాడుతారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుకలు, ప్లాస్టిక్ ఇటుకలు అందుబాటులోకి వచ్చాయి. నేటి తరం వారు ఈ మూడు రకాల ఇటుకలతో […]

best bricks for house :  సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలను సాకారం చేసుకునే సమయంలో సరైన నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా ఇల్లు బలంగా ఉండాలంటే ఇటుకల నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఇల్లు నిర్మాణానికి ఎర్ర ఇటుకలు వాడుతారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుకలు, ప్లాస్టిక్ ఇటుకలు అందుబాటులోకి వచ్చాయి. నేటి తరం వారు ఈ మూడు రకాల ఇటుకలతో అయోమయానికి గురవుతున్నారు. వీటిలో ఏది బెస్ట్ అని తేల్చుకోలేకపోతున్నారు. కొందరు భనవరంగ నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ఏది బెస్టో చూద్దాం..

ఎర్ర ఇటుకలు:
ఇంటి నిర్మాణానికి ఎర్ర ఇటుకలను ఎక్కువ కాలంగా వినియోగిస్తున్నారు. వీటిని మట్టిని తయారు చేసి అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల ఇవి బలంగా ఉంటాయని అంటుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎక్కువగా వీటినే ఉపయోగిస్తారు. ఈ ఇటుకలు వేడిని అడ్డుకుని ఇంటిని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. సాధారణ నిర్మాణాలకు అనువైన ఎంపిక. అయితే నాణ్యత ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది. నాణ్యత లోపిస్తే ఇంటి నిర్మాణంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇటుకలు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి.

సిమెంట్ ఇటుకలు:
సిమెంట్, ఇసుక, కంకర కలయికతో యంత్రాల సహాయంతో ఈ ఇటుకలను తయారు చేస్తారు. ఇవి దాదాపు అన్నీ ఒకే పరిమాణంలో ఉంటాయి. కాబట్టి నిర్మాణంలో ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. ఇవి నీటిని తక్కువగా పీల్చుకుంటాయి. ఈ ఇటుకలతో నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయి. నిర్వహణ ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. అయితే వేడి నిరోధకత ఎర్ర ఇటుకలతో పోలిస్తే కొంత తక్కువగా ఉంటుంది. నాణ్యత కోసం సరైన మిశ్రమంతో తయారైన ఇటుకలనే ఎంచుకోవాలి.

ఫ్లై యాష్ ఇటుకలు:
థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లై యాష్, సిమెంట్, సున్నం, జిప్సం వంటి పదార్థాలతో తయారు చేసే ఇటుకలను ఫ్లై యాష్ ఇటుకలు అంటారు. ప్రస్తుతం ఆధునిక నిర్మాణాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఈ ఇటుకల బరువు తక్కువగా ఉంటుంది. ఉపరితలం సమతలంగా ఉండటంతో ప్లాస్టరింగ్ ఖర్చు తగ్గుతుంది. ఇవి నీటిని తక్కువగా పీల్చుకోవడంతో క్యూరింగ్ సమస్యలు ఉండవు. పరిమాణాలు ఖచ్చితంగా ఉండడంతో భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇవి అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ వీటిని కోరుకుంటే నాణ్యత కలిగినవే ఎంచుకోవాలి.

ఇంటి నిర్మాణానికి ఏ ఇటుకలు ఉపయోగించాలనేది బడ్జెట్, ప్రాంతీయ వాతావరణం, నిర్మాణ నమూనా, ఇంజినీర్ సూచనలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ నిర్మాణాలకు ఎర్ర ఇటుకలు ఇప్పటికీ మంచి ఎంపిక. ఖచ్చితమైన పరిమాణాలు, తక్కువ ప్లాస్టరింగ్ ఖర్చు, పర్యావరణహిత నిర్మాణం కోరుకునేవారికి ఫ్లై యాష్ ఇటుకలు ఉత్తమ ఎంపికగా భావిస్తారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper