Homeఅంతర్జాతీయంDonald Trump: 9.5 లక్షల కోట్లు రీఫండ్‌.. బీరాలకు పోయి వసూలు చేశాడు.. ట్రంప్‌ ఖజానా...

Donald Trump: 9.5 లక్షల కోట్లు రీఫండ్‌.. బీరాలకు పోయి వసూలు చేశాడు.. ట్రంప్‌ ఖజానా ఖాళీ..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన భారీ దిగుమతి సుంకాలు సుప్రీంకోర్టు చేతిలో కొట్టుడుపోయాయి. దీని ఫలితంగా ఇప్పటికే వసూలైన మొత్తాల్లో 100 బిలియన్‌ డాలర్లు (దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయలు) దిగుమతిదారులకు తిరిగి చెల్లిస్తున్నారు. ఈ వాపసు ప్రక్రియ అమెరికా ఖజానాపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. వసూలు చేసిన సొమ్ము సాధారణ బడ్జెట్‌లో కలిసిపోయి ఖర్చయిన తర్వాత ఇప్పుడు […]

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన భారీ దిగుమతి సుంకాలు సుప్రీంకోర్టు చేతిలో కొట్టుడుపోయాయి. దీని ఫలితంగా ఇప్పటికే వసూలైన మొత్తాల్లో 100 బిలియన్‌ డాలర్లు (దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయలు) దిగుమతిదారులకు తిరిగి చెల్లిస్తున్నారు. ఈ వాపసు ప్రక్రియ అమెరికా ఖజానాపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. వసూలు చేసిన సొమ్ము సాధారణ బడ్జెట్‌లో కలిసిపోయి ఖర్చయిన తర్వాత ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సి రావడం ఆర్థిక లెక్కలను అటకెక్కిస్తోంది.

సుప్రీంకోర్టు తీర్పు..
2026 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు 6–3 మెజారిటీతో స్పష్టం చేసింది. అత్యవసర అధికారాల చట్టం అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం ఇవ్వదని, పన్నులు, సుంకాలు కాంగ్రెస్‌ పరిధిలోనివని తీర్పు చెప్పింది. ట్రంప్‌ పరిమితులు దాటి వ్యవహరించారని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వసూలైన మొత్తాలను తిరిగి చెల్లించాలని తేలింది.

వసూళ్లు వాపస్‌..
ట్రంప్‌ యంత్రాంగం ఈ సుంకాల ద్వారా సుమారు 166 బిలియన్‌ డాలర్లు సేకరించింది. అయితే ఇప్పటికే 100 బిలియన్‌ డాలర్లు (వడ్డీతో సహా) దిగుమతిదారులకు తిరిగి ఇచ్చేశారు. కోర్టు ఫైలింగ్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల స్థాయిలో ఆదాయం వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ మొత్తం తిరిగి బయటకు వెళ్తోంది. ఖజానాలోకి వచ్చిన సొమ్ము ఇప్పటికే ఖర్చైపోయి ఉండటంతో వాపసు ప్రక్రియ అదనపు భారంగా మారుతోంది.

ఖజానా ఒత్తిడి..
వసూలైన సుంకాలు సాధారణ ప్రభుత్వ ఖర్చుల్లో కలిసిపోయాయి. ఇప్పుడు భారీ మొత్తం తిరిగి చెల్లించాల్సి రావడం బడ్జెట్‌లో ఖాళీని సష్టిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ రీఫండ్‌లు ఒక నెలలోనే వందల బిలియన్‌ డాలర్ల లోటుకు దోహదం చేశాయి. ఒకప్పుడు ఆదాయ వనరుగా చూపించిన సొమ్ము ఇప్పుడు ఖర్చు కేంద్రంగా మారడం ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికార పరిమితులు దాటి వసూలు చేసిన మొత్తం తిరిగి ఇవ్వాల్సి రావడం వల్ల ఖజానా ఒత్తిడికి గురవుతోంది.

ఆసియా దేశాలకు ఉపశమనం
చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌ వంటి కీలక వాణిజ్య భాగస్వాములపై విధించిన అధిక సుంకాలు రద్దయ్యాయి. దీంతో ఆ దేశాల ఎగుమతిదారులకు, అమెరికా దిగుమతిదారులకు ఉపశమనం లభించింది. అయితే అమెరికా వైపు చూస్తే, ఒకప్పుడు వచ్చిన ఆదాయం ఇప్పుడు తిరిగి వెళ్లిపోవడం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపుతోంది.

అధికార పరిమితులు దాటి విధించిన సుంకాలతో తాత్కాలికంగా ఖజానాకు ఆదాయం వచ్చినప్పటికీ, న్యాయస్థానం తీర్పు తర్వాత అది తిరిగి చెల్లించాల్సిన భారంగా మారింది. ఇది కేవలం ఒక చట్టపరమైన ఓటమి కాదు. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తలు, అధికార వినియోగంలో పరిమితులు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper